యూఎస్ ఎంబసీ సమీపంలో మరోసారి క్షిపణి దాడులు

By telugu teamFirst Published Jan 21, 2020, 8:04 AM IST
Highlights

యూఎస్ ఎంబసీ వద్ద ఇరాన్ దాడులు చేయడం ఇదేమి తొలిసారి కాదు. ఈ నెల మొదటి వారంలో కూడా దాడులు జరిగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది.
 

ఇరాన్, అమెరికాల మధ్య మొదలైన ఉద్రిక్తతలు ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఒకరిపై మరోకరు దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా... ఇరాక్ లోని హైసెక్యురిటీ జోన్ అయిన గ్రీన్ జోన్ వద్ద ఇరాన్ దాడులు చేసింది.  ఇరాక్ లోని యూఎస్ ఎంబసీ సమీపంలో ఈ దాడి జరిగింది. మూడు రాకెట్లతో దాడులు చేసినట్లు తెలుస్తోంది.

ఈ దాడుల్లో ఎంత మంది ప్రాణాలు వదిలారు అనే విషయంపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.  ఈ ఘటనకు  సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై అధికారులు కూడా ఇప్పటి వరకు స్పందించలేదు.  

Also Read చల్లారని ఉద్రిక్తతలు: అమెరికా స్థావరాలపై ఇరాన్ మరోసారి క్షిపణి దాడులు...

యూఎస్ ఎంబసీ వద్ద ఇరాన్ దాడులు చేయడం ఇదేమి తొలిసారి కాదు. ఈ నెల మొదటి వారంలో కూడా దాడులు జరిగాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ బలాద్ ఎయిర్‌బేస్‌పై రాకెట్లతో విరుచుకుపడింది.

ఈ ఘటనలో నలుగురు గాయపడ్డట్లుగా తెలుస్తోంది. దీనిపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మండిపడ్డారు. ఈ ఘటన తమను షాక్‌కు గురిచేసిందని.. తరచుగా జరుగుతున్న ఈ దాడులు ఇరాక్ సార్వభౌమత్వాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్నాయని విమర్శించారు. తాజాగా మరోసారి దాడులకు పాల్పడింది. 

click me!