స్కూల్ హాస్టల్‌లో భీకర అగ్నిప్రమాదం.. 19 మంది చిన్నారులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

Published : May 23, 2023, 06:16 AM IST
స్కూల్ హాస్టల్‌లో భీకర అగ్నిప్రమాదం.. 19 మంది చిన్నారులు మృతి.. పలువురికి తీవ్ర గాయాలు

సారాంశం

దక్షిణ అమెరికాలోని గయానా పాఠశాల వసతి గృహంలో మంటలు చెలరేగడంతో 19 మంది చిన్నారులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.  

దక్షిణ అమెరికాలోని గయానాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక బాలికల బోర్డింగ్ స్కూల్ వసతి గృహంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో 19 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని విదేశీ మీడియా వెల్లడించింది. గయానాలోని మహ్‌దియా సెకండరీ స్కూల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 20 మంది మృతి చెందారనే వార్తలను ఖండిస్తూ.. భారీ మంటలు దేశాన్ని కదిలించాయని జాతీయ అగ్నిమాపక విభాగం అధికార ప్రతినిధి సోమవారం తెలిపారు. ఈ ప్రమాదంలో మరో తొమ్మిది మంది గాయపడ్డారు. ఒక బాధితుడు రక్షించబడ్డాడు, కానీ వెంటిలేటర్‌పై ఉన్నాడు, పరిస్థితి విషమంగా ఉంది.

విదేశీ మీడియా ప్రకారం.. మృతులలో 18 మంది బాలికలు, కేర్‌టేకర్ కుమారుడు ఉన్నారు. గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ ఈ సంఘటన స్పందించారు.బాధాకరమైన,భయంకరమైన ఘటనగా అభివర్ణించారు. దేశ రాజధాని జార్జ్‌టౌన్‌కు 200 మైళ్ల దూరంలో ఉన్న మహ్డియా పర్వత ప్రాంతంలోని అంతర్గత-నగర ఉన్నత పాఠశాలలో ఆదివారం రాత్రి 11:30 గంటల సమయంలో మంటలు చెలరేగాయని స్థానిక మీడియా తెలిపింది.

స్థానిక జనాభాకు సహాయం చేయడానికి ప్రభుత్వం వైద్య సిబ్బంది, పరికరాలు, విమానాలతో పూర్తి స్థాయి వైద్య అత్యవసర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసిందని అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితులను గంటల వ్యవధిలో జార్జ్‌టౌన్‌కు తరలించారు. మరికొందరు మహదియా జిల్లా ఆసుపత్రిలో చేరారు. అక్కడ వారు పరిశీలనలో ఉంచబడ్డారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే