
Philippines Boy: తుఫాను కారణంగా కొండచరియలు విరిగిపడుతున్న సమయంలో ఓ బాలుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి తెలివిగా ఆలోచించి రిఫ్రిజిరేటర్‌లో లోకి దూరాడు. కొండచరియలు ఇరిగిపడ్డాయి. తను ఉన్న ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయితే, ఆ పిల్లాడు ఉన్న రిఫ్రిజిరేటర్ కొండచరియలు వరిగిపడటంతో కాస్త దెబ్బతింది. దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. దాదాపు 20 గంటలకు పైగా ఆ బాలుడు రిఫ్రిజిరేటర్‌లో నే ఉండిపోయాడు. మిరాకిల్ గా ఆ బాలుడు కొండచరియల విరిగిపడిన ఘటన నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఫిలిప్పీన్స్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఫిలిప్పీన్స్‌లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెగి తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. బేబే సిటీలోని వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఉష్ణమండల తుఫాను మెగి నేపథ్యంలో లేటె ప్రావిన్స్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించగా.. కొద్దగి దెబ్బతిన్నరిఫ్రిజిరేటర్‌లో ను అధికారులు గుర్తించారు. కొండచరియల విరిగిపడటం నుంచి తప్పించుకోవడానికి అందులో ఉన్న బాలుడు జాస్మే ని గుర్తించిన అధికారులు.. గాయపడిన అతన్ని బయటకు తీశారు. కొండచరియలు విరిగిపడటంతో పెద్దమొత్తంలో బురద ఇంటిని ఆక్రమిస్తున్న తరుణంలో వెంటనే ఆలోచించిన 11 ఏండ్ల జాస్మే..ఫ్యామిలీ రిఫ్రిజిరేటర్‌లోకి వెళ్లాడు. కొండచరియలు.. తుఫాను నుండి తనను రక్షించుకోవడానికి జాస్మే దాదాపు 20 గంటలపాటు ఆందులో ఉన్నాడు.
తుఫాను.. కొండచరియలు విరిగిపడటంతో జాస్మే ఉన్న రిఫ్రిజిరేటర్ నది ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఈ క్రమంలోనే అది దెబ్బతిన్నది. దానిని గుర్తించి ఎమర్జెన్సీ టీం.. బురదలో చిక్కుకున్న రిఫ్రిజిరేటర్ ను పైకి తీసారు. అందులో ఉన్న జాస్మే.. స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. రిఫ్రిజిరేటర్ నుంచి ఆ బాలుడుని బయటకు తీసిన వెంటనే “నాకు ఆకలిగా ఉంది” అని తమతో చెప్పిన మొదటి మాటలని రక్షణ బృందం తెలిపింది. కోండచరియలు, తుఫాను కారణంగా జాస్మే ఉన్న రిఫ్రిజిరేటర్ చాలా దూరం వరకు దొర్లుకుంటూ మట్టి కారణంగా దెబ్బతిన్నది. ఈ క్రమంలో జాస్మే కాలు విరిగిందని పరీక్షల్లో అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో అతని కాలుకు ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటన నుంచి జాస్మే ఒక్కడు ప్రాణాలతో బయటపడినప్పటికీ.. అతని తల్లి, తోబుట్టువులు ఇప్పటికీ కనిపించకుడా పోయారని పోలీసులు తెలిపారు. బాలుడి తంత్రి ఈ ఘటనకు ఒక రోజు ముందు కొండచరియలు విరిగిపడిన ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అతని 13 ఏళ్ల సోదరుడు ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కాగా, ఈ తుఫాను కారణంగా ఒక్క బేబేలోనే దాదాపు 200 మంది గ్రామస్తులు గాయపడినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సుమారు 172 మంది మరణించారని సమాచారం. తుఫాను కారణంగా 200 మిలియన్లకు పైగా ప్రజలను ఈ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికీ వందలాది మంది తప్పిపోయారు. వారి కోసం రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ఇంకా అక్కడ తుఫాను ప్రభావం కొనసాగుతోంది.