పాకిస్తాన్ లో వరుస గ్యాస్ లీక్ ఘటనలు.. నలుగురు చిన్నారులతో సహా 16 మంది మృతి..

By Rajesh KarampooriFirst Published Jan 26, 2023, 6:06 AM IST
Highlights

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగరంలో గత వారం రోజుల్లో గ్యాస్ లీకేజీ ఘటనల కారణంగా చిన్నారులతో సహా కనీసం 16 మంది మరణించారు. క్వెట్టాలోని కిల్లి బడేజాయ్ ప్రాంతంలో గ్యాస్ లీకేజీ పేలుడు సంభవించడంతో ఒక కుటుంబంలోని నలుగురు పిల్లలు మట్టి గోడల ఇంటిలో మరణించారు.

పాకిస్థాన్‌లోని నైరుతి బలూచిస్థాన్ ప్రావిన్స్‌ లో విషాదం ఘటన చోటుచేసుకుంది.  క్వెట్టా నగరంలో గత వారం రోజుల్లో గ్యాస్ లీక్ ఘటనల్లో చిన్నారులతో సహా కనీసం 16 మంది మరణించారు. తాజాగా బుధవారం క్వెట్టాలోని కిల్లి బడేజాయ్ ప్రాంతంలో ఇంటిలో గ్యాస్ లీక్ పేలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు మరణించారు.  ఈ ఘటనలో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. పిల్లలు నిద్రిస్తున్న సమయంలో గదిలో గ్యాస్ నిండిపోయి పేలిపోవడంతో ఇంటి గోడలు కూలిపోయాయని పోలీసులు తెలిపారు.

మరో  సంఘటనలో..

క్వెట్టాలోని మరొక ప్రాంతంలో పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ మరణించాడు. గత వారం నుండి ప్రతిరోజూ అనేక కేసులు నమోదయ్యాయని, ఇందులో డజనుకు పైగా ప్రజలు మరణించారని ,వారి ఇళ్లలో గ్యాస్ లీకేజీ కారణంగా డజన్ల కొద్దీ స్పృహతప్పి పడిపోయారని సీనియర్ పోలీసు అధికారి ధృవీకరించారు. పెద్ద ఎత్తున గ్యాస్‌ లోడ్‌ షెడ్డింగ్‌, అల్పపీడనం కారణంగా లీకేజీ జరిగిందని ఆయన చెప్పారు.

బలూచిస్థాన్‌లో ప్రస్తుతం గత నెల రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంది.రిపోర్టుల ప్రకారం గ్యాస్ లోడ్ షెడ్డింగ్ , లీకేజీ సమస్య క్వెట్టాలోనే కాకుండా జియారత్, కలాత్ వంటి సమీప ప్రాంతాలలో కూడా ప్రస్తావనకు వచ్చింది. మంగళవారం  గ్యాస్ లీక్ ఘటనతో ఓ వ్యక్తి, అతని ముగ్గురు కుమారులు ఊపిరాడక మరణించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అమానుల్లా (50), అతని ముగ్గురు కుమారులు హఫీజుల్లా, ముహిబుల్లా ,బీబుల్లా మరణించారు. సోమవారం రాత్రి ఇంటికి వెళ్లకుండా తన దుకాణం పక్కనే ఉన్న అద్దె గదిలో నిద్రకు ఉపక్రమించినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. అతను నిద్రిస్తున్నప్పుడు గ్యాస్ హీటర్‌ను ఎక్కడ ఉంచాడు, చాలా సేపటి తర్వాత అతను గదిలోనే ఊపిరాడక చనిపోయాడు.
 

click me!