కెన్యాపై ఉగ్రపంజా: ఆత్మాహుతి దాడిలో 15 మంది బలి

By Arun Kumar PFirst Published Jan 16, 2019, 10:09 AM IST
Highlights

విదేశీయులనే లక్ష్యంగా చేసుకుని కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విదేశీయులు ఎక్కువగా నివాసముండే ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడి 15 మందిపి పొట్టపపెట్టుకున్నారు. అలాగే మరికొంత  మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ దారుణానికి  సంబందించిన వివరాలిలా ఉన్నాయి. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ‘డస్టిట్‌డీ2’హోటల్ ప్రాంగణంలోకి మారణాయుధాలతో ప్రవేశించారు. హోటల్ కు వచ్చే  వాహనాలను నిలిపివుంచే పార్కింగ్ ప్రాంతంపై బాంబులు విసిరారు. అంతేకాకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతేకాకుండా ఓ ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. ఇలా అన్ని వైపుల నుండి...అన్ని రకాలుగా దాడులు జరపడంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. 

ఈ దాడిలో దాదాపు 15 మంది అమాయకులు మృతిచెంది వుంటారని తెలుస్తోంది. అయితే ముష్కరులు హోటల్లోకి ప్రవేశించి వుంటే మరింత ప్రాణనష్టం జరిగివుండేది.   

ఈ దాడులకు తెగబడింది తామేనంటూ ‘అల్‌-షబాబ్‌’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడిపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతాబలగాలు సహాయక చర్యలు చేపట్టారు. హోటల్ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  
  
click me!