కన్నయ్య కుమార్‌ పై రాజద్రోహం కేసు: ఛార్జీషీట్ దాఖలు

By narsimha lodeFirst Published Jan 14, 2019, 5:19 PM IST
Highlights

జెఎన్‌యూఎస్‌యూ (జెఎన్‌యూ) మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌తో పాటు  మరికొందరిపై   ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు చార్జీషీటు దాఖలు చేశారు.

న్యూఢిల్లీ: జెఎన్‌యూఎస్‌యూ (జెఎన్‌యూ) మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్‌తో పాటు  మరికొందరిపై   ఢిల్లీ పోలీసులు సోమవారం నాడు చార్జీషీటు దాఖలు చేశారు.

2016లో కన్నయ్య కుమార్‌తో పాటు మరికొందరిపై రాజద్రోహం కేసు నమోదైంది.జెఎన్‌యూ స్టూడెంట్  ఉమర్ ఖలీద్ అనిర్బన్ భట్టాచార్యలు ఇండియాకు వ్యతిరేకంగా  2016 ఫిబ్రవరి 9వ తేదీన నినాదాలు చేశారని కేసు నమోదైంది.

పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురు ఉరిశిక్షకు గుర్తుగా ఈ నినాదాలు చేశారని కేసు నమోదైంది.ఈ ఘటనలో  కాశ్మీర్‌కు చెందిన విద్యార్థులు అఖిబ్ హుసేన్ ముజీబ్ హుస్సేన్, మునీబ్ హుస్సేన్, ఉమర్ గుల్,  రాస్సోల్, బషీర్ భట్, బసంత్‌లు ఉన్నారు. 

వీరితో పాటు సీపీఐ కీలక నేత డి. రాజా కూతురు అపరాజిత , అప్పటి జేఎన్‌యూ ఉపాధ్యక్షుడు  రషీద్, రామనాగ అశుతోష్ కుమార్,  భనోజ్యోత్స్న లాహిరి పేర్లు కూడ ఛార్జీషీటులో ఉన్నాయి.  

మెట్రోపాలిటజన్ మేజిస్ట్రేట్ కు ఈ చార్జీషీటు చేరే అవకాశం ఉంది. ఈ కేసుకు సంబంధించి సీసీటీవీ పుటేజీ, మొబైల్ ఫోన్ సాక్ష్యాలను పోలీసులు సాక్ష్యాలుగా సేకరించారు. ఈ విషయాన్ని ఛార్జీషీటులో ప్రస్తావించారు. మరోవైపు  ఈ చార్జీషీటును రాజకీయ కుట్రలో భాగమేనని కన్నయ్య కుమార్ అభిప్రాయపడ్డారు.
 

 

Delhi Police statement on 2016 JNU sedition case: Charge sheet filed. Names of 10 persons have been sent to court, requesting to initiate a trial. Names of 36 persons have been put in the list of persons against whom sufficient evidence hasn't come on file so far to launch trial. pic.twitter.com/DM0z5RZXag

— ANI (@ANI)

 

click me!