చికాగో: పార్టీలో ఫ్రెండ్స్ మధ్య వివాదం.. కాల్పులు

Published : Dec 22, 2019, 09:09 PM ISTUpdated : Dec 22, 2019, 09:30 PM IST
చికాగో: పార్టీలో ఫ్రెండ్స్ మధ్య వివాదం.. కాల్పులు

సారాంశం

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ పార్టీలో జరిగిన వివాదం కాల్పులకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ఇంట్లో కొందరు యువకులు పార్టీని చేసుకుంటున్నారు. 

అమెరికాలో మరోసారి తుపాకులు గర్జించాయి. ఓ పార్టీలో జరిగిన వివాదం కాల్పులకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ ఇంట్లో కొందరు యువకులు పార్టీని చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారిలో వివాదం చోటు చేసుకుని పరస్పరం కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.

ఈ ఘటనలో 13 మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్ధితి విషమంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు తుపాకీతో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి... అతని నుంచి గన్‌ స్వాధీనం చేసుకున్నారు. బాధితులంతా 16 నుంచి 48 ఏళ్ల మధ్య వయస్సు వారే.. ఆ ఇంట్లో గతంలోనూ పలుమార్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. 

Also Read:చస్తే.... శవాన్ని ఉరితీయండి... ముషారఫ్ పై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు

Also Read:నా ఫోటోలు తీస్తే నెలకు రూ.26.6 లక్షల జీతం ఇస్తా.. బిజినెస్ బంఫర్ ఆఫర్ 

 

PREV
click me!

Recommended Stories

VENEZUELA: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని..వెనిజులా పరిస్థితి ఇదే
USA: ఏ దేశ అధ్య‌క్షుడినైనా ట్రంప్ అరెస్ట్ చేయొచ్చా.? ఇంత‌కీ ఆ హ‌క్కు ఎవ‌రిచ్చారు.?