Omicron Deaths: బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో 12 మంది మృతి.. ఆస్పత్రిలో చేరిన 104 మంది..

Published : Dec 20, 2021, 02:17 PM IST
Omicron Deaths: బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో 12 మంది మృతి.. ఆస్పత్రిలో  చేరిన 104 మంది..

సారాంశం

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ (Omicron) యూరప్ దేశాల్లో విజృంభిస్తోంది. బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో 12 మంది మృతిచెందారని  ఉప ప్రధాని డొమినిక్ రాబ్ (dominic raab) వెల్లడించారు.

కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ (Omicron) యూరప్ దేశాల్లో విజృంభిస్తోంది. అక్కడ పెద్ద సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. బ్రిటన్‌లో ఒమిక్రాన్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్క రోజే 10 వేలకు పైగా ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తుంది. అయితే బ్రిటన్‌లో ఒమిక్రాన్‌తో 12 మంది మృతిచెందారు (Omicron Deaths). ఈ వివరాలను సోమవారం బ్రిటన్ ఉప ప్రధాని డొమినిక్ రాబ్ (dominic raab) టైమ్స్ రెడియోకు వెల్లడించారు. ఇప్పటివరకు 104 మంది ఒమిక్రాన్‌తో ఆస్పత్రిలో చేరినట్టుగా వెల్లడించారు. 

ఇక, ఒమిక్రాన్ యావత్ ప్ర‌పంచాన్ని భ‌యాందోళ‌న‌కు గురిచేస్తున్న‌ది. ఈ వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుండ‌టంతో కేసులు గ‌ణ‌నీయంగా పెరుగుతున్నాయి. బ్రిట‌న్ లో  ఒమిక్రాన్ పంజా మాములుగా లేదు.. ఒకే రోజు 90 వేల‌కు పైగా కోవిడ్-19 కేసులు న‌మోదుకాగా, అందులో 10 వేల‌కు పైగా ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఒక్క‌రోజులోనే అక్క‌డ ఒమిక్రాన్ కేసుల న‌మోదులో మూడు రెట్లు పెరుగుద‌ల చోటుచేసుకుంది. మరోవైపు కరోనాతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. 

Omicron వేరియంట్ ను ఎదుర్కొవ‌డానికి ప్ర‌భుత్వంతో క‌లిసి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని UK ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ అన్నారు. క‌ర‌నా వైర‌స్ వ్యాప్తి క‌ట్ట‌డి కోసం మ‌రిన్ని క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఆయ‌న పేర్కొంటున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం లాక్ డౌన్, కఠిన ఆంక్ష‌లు విధించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వార్తలు వస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?