ఫిలిప్పీన్స్ ఫెర్రీలో అగ్నిప్రమాదం, 12 మంది మృతి, పలువురు గల్లంతు..

By SumaBala BukkaFirst Published Mar 30, 2023, 12:27 PM IST
Highlights

చిన్న పడవలలో ఉన్న సిబ్బంది చీకట్లో ప్రయాణీకులను రక్షించడం, కోస్ట్ గార్డ్ నౌకలు మండుతున్న ఫెర్రీపై నీటిని చల్లడం ఫొటోల్లో కనిపిస్తోంది. 

మనీలా : దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఫెర్రీలో మంటలు చెలరేగడంతో కనీసం 12 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 230 మందిని రక్షించినట్లు అధికారులు గురువారం తెలిపారు. లేడీ మేరీ జాయ్ 3 మిండానావో ద్వీపంలోని జాంబోంగా సిటీ నుండి సులు ప్రావిన్స్‌లోని జోలో ద్వీపానికి వెళుతుండగా బుధవారం నాడు ఈ ఘటన జరిగింది.  మంటలు చెలరేగడంతో ప్రయాణికులు పైనుంచి దూకినట్లు విపత్తు అధికారి నిక్సన్ అలోంజో తెలిపారు.

బాసిలాన్ ప్రావిన్స్‌లోని బలుక్-బలుక్ ద్వీపం నుండి ఫెర్రీలో మంటలు చెలరేగడంతో ఫిలిప్పీన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది, మత్స్యకారులు.. 195 మంది ప్రయాణికులు, 35 మంది సిబ్బందిని రక్షించారు. వీరిలో పద్నాలుగు మంది గాయపడ్డారు. ఏడుగురు కనిపించలేదు.

ఓడ మానిఫెస్ట్‌లో జాబితా చేయబడిన 205 మందిని మించి ఓడలో ఉన్న ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఎక్కువ మంది వ్యక్తులు తప్పిపోవచ్చని బాసిలన్ గవర్నర్ జిమ్ సల్లిమాన్ తెలిపారు.‘నీటిలోనుంచి పన్నెండు శవాలను వెలికితీశారు. వారిలో ముగ్గురు పిల్లలు, ఆరు నెలల పాప కూడా ఉన్నారు" అని సల్లిమాన్ తెలిపారు.

పాకిస్తాన్ లో ఉచిత గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి, అనేకమందికి గాయాలు..

బహుశా మానిఫెస్ట్‌లో నమోదు చేసుకోని ప్రయాణికులు ఉండవచ్చు అన్నారు. మంటలు ఎలా చెలరేగాయి అనేది స్పష్టంగా తెలియరాలేదు. ప్రాణాలతో బయటపడిన వారిని జాంబోంగా, బాసిలన్‌లకు తీసుకెళ్లారు, అక్కడ గాయపడిన వారికి చికిత్స అందించారని సల్లిమాన్ చెప్పారు. కోస్ట్ గార్డు విడుదల చేసిన ఫోటోలు దాని నౌకల్లో ఒకటి కాలిపోతున్న ఫెర్రీపై నీటిని చల్లడం కనిపించింది, చిన్న పడవలలో దాని సిబ్బంది చీకట్లో, నీళ్లలో నుంచి ప్రయాణీకులను రక్షించడం కనిపిస్తుంది. 

ఫిలిప్పీన్స్, 7,000 కంటే ఎక్కువ ద్వీపాలతో కూడిన ద్వీపసమూహం, సముద్ర రవాణా సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోంటుంది.  పడవల రద్దీ, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం వల్ల ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది.

click me!