అమెరికాలో 11 మంది ఇండియన్ విద్యార్ధుల అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 23, 2020, 4:22 PM IST
Highlights

 దేశంలో మోసపూరితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ 11 మంది భారతీయ విద్యార్ధులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాలకు చెందిన మరో నలుగురిని కూడ ఇదే విషయమై ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

వాషింగ్టన్: దేశంలో మోసపూరితంగా ఉంటున్నారని ఆరోపిస్తూ 11 మంది భారతీయ విద్యార్ధులను అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర దేశాలకు చెందిన మరో నలుగురిని కూడ ఇదే విషయమై ఎఫ్‌బీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

దేశంలోని పలు ప్రాంతాల్లో వీరిని అరెస్ట్ చేసినట్టుగా ఎఫ్ బీ ఐ ప్రకటించింది. బోస్టన్, వాషింగ్టన్, హుస్టన్, లౌడ్రలీ, న్యూయార్క్, న్యాష్‌వల్లీ, పీట్స్‌బర్గ్, హరీస్‌బర్గ్ ల నుండి 11 మంది భారతీయ విద్యార్థులను అరెస్ట్ చేశారు.

also read:మురికి దేశం: ఇండియాపై డోనాల్డ్ ట్రంప్ అక్కసు

యూఎస్ ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌పోర్స్ మెంట్ అధికారులు ఇద్దరు లిబియన్లు, బంగ్లాదేశ్, సెంజెగలీస్ కు దేశాలకు చెందిన ఒక్కొక్కరిని అరెస్ట్ చేశారు.అమెరికాలో ఉండడానికి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని మోసపూరింగా ఉపయోగించారని ఇమ్మిగ్రేషన్  కస్టమ్స్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు చెబుతున్నారు. 

విద్యార్ధులు తమ అధ్యయన రంగానికి సంబంధించిన స్థానాల్లో ఏడాది వరకు యూఎస్ లో పనిచేసేందుకు వీలు కల్పిస్తోంది. విద్యార్ధి, సైన్స్,ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్ ప్రాక్టికల్ శిక్షణలో పాల్గొంటే 24 నెలల పాటు అదనంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.

ఈ విద్యార్ధులు ఉనికిలో లేని సంస్థల ద్వారా ఉద్యోగం చేస్తున్నట్టుగా ఐసీఈ ప్రకటించింది.

అమెరికాకు మొదటి స్థానం ఇవ్వడమే కాకుండా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ యొక్క చట్టాలు అమలులో ఉన్నాయని నిర్ధారించుకోవడానికి ఇది మరొక ఉదహరణ అని యాక్టింగ్ డిప్యూటీ సెక్రటరీ  కెన్ కుసినెల్లి చెప్పారు.

click me!