24గంటలు పర్వాతాల్లో చిక్కుకున్న చిన్నారి..!

By telugu news teamFirst Published Jun 10, 2023, 1:05 PM IST
Highlights

కిట్టిటాస్ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ ఆ చిన్నారిని రక్షించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేస్తుంది.

పదేళ్ల బాలిక పర్వాతాల్లో చిక్కుకుపోయింది. దాదాపు 24గంటలపాటు ఆ పర్వాతాల్లో చిక్కుకుంది. కనీసం, తిండి, తిప్పలు లేకుండా ఆ చిన్నారి అందులో ఉండటం గమనార్హం. అయితే, ఆ చిన్నారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో చోటుచేసుకోగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో శీతల క్యాస్కేడ్ పర్వత శ్రేణిలో షుంగ్లా మశ్వా అనే బాలికగా గుర్తించారు.  కిట్టిటాస్ షెరీఫ్ డిపార్ట్‌మెంట్ ఆ చిన్నారిని రక్షించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో షేర్ చేస్తుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే, చిన్నారి కుటుంబం  క్లీ ఎల్మ్ వ్యాలీని సందర్శించడానికి  వెళ్లారు. ఆ సమయంలో చిన్నారి తప్పిపోయింది. షుంగ్లా కుటుంబం మధ్యాహ్న భోజనం కోసం ఆగిపోయే ముందు, ఆమె పెద్ద కుటుంబం నుండి చిన్నారి తప్పిపోయింది. దాదాపు, 20 మంది కుటుంబ సభ్యులు అంతా కలిసి వెళ్లగా, చిన్నారి మాత్రం తప్పిపోయింది.

 

అయితే, కుటుంబ సభ్యులు  చిన్నారి కోసం చాలా వెతికారట. దాదాపు రెండు గంటల పాటు వెతకగా ఆచూకీ దొరకలేదు. దీంతో  వారు అధికారులకు ఫిర్యాదు  చేశారు. వాషింగ్టన్ రాష్ట్రం అంతటా ఉన్న బృందాలు భారీ శోధన, రెస్క్యూ ప్రయత్నం తర్వాత మరుసటి రోజు షుంగ్లా కనుగొన్నారు.

3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతల్లో వెచ్చగా ఉండేందుకు చిన్నారి రెండు చెట్ల మధ్య పడుకున్నట్లు వారు తెలిపారు. కాగా, చిన్నారి క్షేమంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిన్నారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

click me!