పది నిమిషాలు ముద్దు పెట్టాడు.. అంతే, చెవుడు వచ్చేసింది

Published : Aug 30, 2023, 01:56 PM ISTUpdated : Aug 30, 2023, 01:59 PM IST
  పది నిమిషాలు ముద్దు పెట్టాడు.. అంతే, చెవుడు వచ్చేసింది

సారాంశం

ఆ తర్వాత నుంచి అతనికి చెవులు వినపడటం ఆగిపోయిందట. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  


ముద్దు పెట్టుకోవడం వల్ల  చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని చాలా మంది వినే ఉంటారు. దంపతుల మధ్య ప్రేమ పెరగడానికి కూడా ముద్దు సహాయపడుతుంది. కానీ, అదే ముద్దు ప్రమాదంలో పడేస్తుందని మీకు తెలుసా? ఓ వ్యక్తి  తన గర్ల్ ఫ్రెండ్ కి పది నిమిషాల పాటు ముద్దుపెట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచి అతనికి చెవులు వినపడటం ఆగిపోయిందట. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


నివేదిక ప్రకారం, చైనాలోని తూర్పు జెజియాంగ్ ప్రావిన్స్‌లోని వెస్ట్ లేక్ సమీపంలో వ్యక్తి , అతని ప్రియురాలిని ముద్దు పెట్టుకున్నాడు. దాదాపు పది నిమిషాలపాటు ముద్ద పెట్టుకోవడం విశేషం.  చైనీస్ వాలెంటైన్స్ డే నాడు ఆగస్ట్ 22న ఈ సంఘటన జరిగింది.

ముద్దు పెట్టుకుంటున్న సమయంలో బబ్లింగ్ శబ్ధం వినిపించిందని, ఎడమ చెవిలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం అతని చెవిపోటుకు చిల్లులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

ఇంకా కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని చెప్పారు. చెవిలో కి ఎక్కువ గాలి వెళ్లడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు.
 

PREV
click me!

Recommended Stories

USA: ఇక అమెరికాలో పిల్ల‌ల్ని క‌న‌డం కుద‌ర‌దు.. బ‌ర్త్ టూరిజంకు చెక్ పెడుతోన్న ట్రంప్
Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !