అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Published : Sep 24, 2021, 09:46 AM IST
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఒకరి మృతి

సారాంశం

టెన్నెసీలో గల మెమిఫిస్ వద్ద ఓ దుండగుడు రెచ్చిపోయాడు. సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు బీభత్సం సృష్టించాడు. దీంతో ఒకరు చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. 

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది.  అమెరికాలో కాల్పులు చోటు చేసుకోవడం కొత్త విషయమేమీ కాదు. అయితే.. భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడ పర్యటనలో ఉండగా.. ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. తీవ్ర కలకలం రేపుతోంది. అయితే ఈ ఘటన మోదీ ఉన్న ప్రాంతంలో కాకపోవడం కాస్త ఊరటనిచ్చే విషయం.

ఓ సూపర్ మార్కెట్లో దుండగులు కాల్పులు జరపగా ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. టెన్నెసీలో గల మెమిఫిస్ వద్ద ఓ దుండగుడు రెచ్చిపోయాడు. సూపర్ మార్కెట్ వద్ద కాల్పులు బీభత్సం సృష్టించాడు. దీంతో ఒకరు చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. ప్రతీగా కాల్పులు జరిపారు. దీంతో కాల్పులు జరిపిన వ్యక్తి కూడా చనిపోయారని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది.


ఇదిలా ఉండగా. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అక్కడ ఉపాధ్యక్షురాలు కమలాహారిస్  తో సమావేశమయ్యారు. వీరు ప్రపంచ సమస్యల గురించి ఈ సమావేశంలో చర్చించడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Most Beautiful Countries : ప్రపంచంలో అత్యంత అందమైన 5 దేశాలు ఇవే.. వావ్ అనాల్సిందే !
Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?