మానస సరోవర్ యాత్ర.. నేపాల్ చేరిన తెలుగువారు

Published : Jun 25, 2019, 12:12 PM IST
మానస సరోవర్ యాత్ర.. నేపాల్ చేరిన తెలుగువారు

సారాంశం

మానస సరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తెలుగువారు  ఎట్టకేలకు నేపాల్ చేరుకున్నారు. 

మానస సరోవర్ యాత్రకు వెళ్లి అక్కడ చిక్కుకున్న తెలుగువారు  ఎట్టకేలకు నేపాల్ చేరుకున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా చెన్నై, ఢిల్లీకి చెందిన 44 మంది యాత్రికులు జూన్ 13 మానససరోవర్ యాత్రకు బయలుదేరారు. వీరంతా సదరన్ ట్రావెల్స్ ద్వారా వెళ్లారు. అయితే, వాతావరణం అనుకూలించక వారిని తీసుకెళ్లిన సదరన్‌ ట్రావెల్స్‌ హెలికాప్టర్‌ తిరిగి రాకపోవడంతో మంచు కొండల్లో చిక్కుకుపోయారు. 

దీంతో.. తమకు సహాయం చేయాలంటూ వారు ప్రభుత్వాన్ని కోరుకున్నారు. నాలుగు రోజుల పాటు అవస్థలు పడిన వారు ఎట్టకేలకు సోమవారం సాయంత్రం సురక్షితంగా నేపాల్ చేరుకున్నారు. 44మంది ప్రయాణికుల్లో హైదరాబాద్ కి చెందినవారే 35మంది వరకు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. వారు అక్కడ చిక్కుకుపోవడంతో వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారన్న వార్త వినగానే.. ఊపిరి పీల్చుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Iran: అస‌లు ఇరాన్‌లో ఏం జ‌రుగుతోంది.? నిజంగానే 12 వేల మంది మ‌ర‌ణించారా.?
IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం