అంతర్జాతీయ వేదికపై విషం కక్కిన ఇమ్రాన్ ఖాన్... మండిపడుతున్న భారత్

By telugu teamFirst Published Jan 24, 2020, 11:26 AM IST
Highlights

కాగా... ఇమ్రాన్ వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందించారు. ఇమ్రాన్ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ నిరాశలో ఉన్నారని.. రోజు రోజుకీ ఆయన నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆయన మాటలనే బట్టే అర్థమౌతోందని రవీష్ కుమార్ అన్నారు

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి భారత్ పై విషం  కక్కారు. అంతర్జాతీయ వేదికగా కశ్మీర్ అంశాన్ని తీసుకువచ్చి భారత్ పై తనకు ఉన్న విద్వేషాన్ని అందరి ముందూ తెలియజేశారు. కాగా... ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్స్ పై భారత్ తీవ్రస్థాయిలో మండిపడుతోంది.  

స్విట్టర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్-2020 సమావేశానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్‌పై మరోసారి పలు విమర్శలు చేశారు. ఆర్టికల్ 370 అంశంపై గతంలో భారత్ పై పలు విమర్శలు చేసిన ఇమ్రాన్ ఖాన్ మరోసారి తన విద్వేషాన్ని వెల్లగక్కారు. సీఏఏ అంశాన్ని కూడా లేవనెత్తడం గమనార్హం.

కాగా... ఇమ్రాన్ వ్యాఖ్యలకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ స్పందించారు. ఇమ్రాన్ ఇలా మాట్లాడటం కొత్తేమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇమ్రాన్ ఖాన్ నిరాశలో ఉన్నారని.. రోజు రోజుకీ ఆయన నమ్మకాన్ని కోల్పోతున్నారని ఆయన మాటలనే బట్టే అర్థమౌతోందని రవీష్ కుమార్ అన్నారు. ప్రపంచం పాక్ ద్వంద్వ వైఖర్ ని చూస్తోందన్నారు.  ఒకవైపు తాము ఉగ్రవాద బాధితులమంటూనే.. మరో వైపు భారత్,ఇతర దేశాలపై ఉగ్రదాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

కశ్మీర్ విషయంలో తాము స్థిరంగా, స్పష్టంగా ఉన్నామని రవీష్ కుమార్ చెప్పారు. ఈ కశ్మీర్ విషయం భారత్-పాక్ మాత్రమే చర్చించాల్సిన విషయమని అన్నారు. దీనిలోకి మూడో వారికి ప్రవేశం లేదని అన్నారు.

Also Reda విజృంభిస్తున్న కొరోనా వైరస్... చైనాలోని ఐదు పట్టణాలు మూసివేత...

ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ భారత్ పై పలు విమర్శలు  చేశారు.'హౌడీ మోదీ వల్ల నాకేమీ బాధ లేదు. అమెరికా-భారత్ మధ్య సంబంధాలను అర్థం చేసుకున్నాను. భారత్ అతిపెద్ద మార్కెట్ కలిగిన దేశం. కానీ భారత్ అనుసరిస్తున్న మార్గంపై ఆందోళన చెందుతున్నాను. ఒక్కసారి మీరు చరిత్రను, నాజీ జర్మనీ క్రమాన్ని చదివినట్టయితే.. ప్రస్తుతం భారత్‌లోనూ అవే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం(CAA)నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. భారత్‌ను ఇమ్రాన్ నాజీ జర్మనీతో పోల్చారు. రెండోసారి ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారత్‌లో జింగోయిజం మరింత పుట్టుకొచ్చిందన్నారు. ఇప్పటికే భారత్‌లో తీవ్ర నిరసనలు జరుగుతున్నాయని,నియంత్రణ రేఖ వెంబడి బాంబు దాడులు జరుగుతున్నాయని చెప్పారు. వీటి నుంచి దృష్టి మరల్చేందుకు ప్రభుత్వం ఏమైనా చేయవచ్చన్నారు. ఈ కామెంట్స్ కి భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది. 

click me!