ఆస్ట్రేలియాపై సెమీ ఫైనల్: ఇంగ్లాండుకు వర్షం షాక్?

By telugu teamFirst Published Jul 8, 2019, 11:08 AM IST
Highlights

రెండు రోజులు కూడా మ్యాచ్‌ రద్దయితే లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులకు వర్షం తాకిడి తప్పలేదు.

బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ లో ఆతిథ్య ఇంగ్లాండు జట్టు కొంప మునిగేట్లే ఉంది. వానదేవుడు ఇంగ్లాండును ఓడించే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. ఇరు జట్ల మధ్య ఎడ్జ్ బాస్టన్ మైదానంలో ఈ నెల 11వ తేదీన సెమీ ఫైనల్ జరుగుతుంది.

మ్యాచ్‌ జరగాల్సిన గురువారంనాడే కాకుండా రిజర్వ్‌డే నాడు కూడా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ నివేదిక తెలియజేస్తోంది. ఈ రెండు రోజుల్లో ఒక్కరోజైనా కనీసం 20 ఓవర్ల మ్యాచ్‌ సాధ్యమైతే సమస్య ఉండదు. కానీ వర్షంతో రెండు రోజులు కూడా మ్యాచ్‌ సాధ్యంకాకపోతే మాత్రం ఇంగ్లాండ్‌ ఓటమి పాలు కాక తప్పదు. 

రెండు రోజులు కూడా మ్యాచ్‌ రద్దయితే లీగ్‌ దశలో ఇంగ్లాండ్‌ కన్నా ఎక్కువ పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటి వరకు ఏడు మ్యాచులకు వర్షం తాకిడి తప్పలేదు.

click me!