పాక్ ఔట్: టీమిండియాకు షోయబ్ అక్తర్ సపోర్ట్, రోహిత్ పై ప్రశంసలు

By telugu teamFirst Published Jul 7, 2019, 9:15 PM IST
Highlights

ఈసారి ప్రపంచ కప్ ఉప ఖండపు జట్టే సొంతం చేసుకోవాలనేది తన కోరిక అని, ఆ క్రమంలోనే మెగా టోర్నీలో మిగిలి ఉన్న భారత్‌కే తాను మద్దతుగా నిలుస్తున్నానని చెప్పాడు.  సెమీస్‌లో భారత జట్టు ప్రత్యర్థి న్యూజిలాండ్‌ ఒత్తిడిలో పడకుండా ఉంటే గట్టి పోటీ ఇస్తుందని అభిప్రాయపడ్డాడు.

మాంచెస్టర్‌: ప్రపంచ కప్ పోటీల నుంచి పాకిస్తాన్ ఔట్ కావడంతో ఆ దేశపు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తన మద్దతు టీమిండియాకేనని అన్నాడు. పాకిస్తాన్ లీగ్ దశలోనే ప్రపంచ కప్ టోర్నమెంటు నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఉపఖండంలో భాగమైన భారత జట్టే విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించాడు. 

ఈసారి ప్రపంచ కప్ ఉప ఖండపు జట్టే సొంతం చేసుకోవాలనేది తన కోరిక అని, ఆ క్రమంలోనే మెగా టోర్నీలో మిగిలి ఉన్న భారత్‌కే తాను మద్దతుగా నిలుస్తున్నానని చెప్పాడు.  సెమీస్‌లో భారత జట్టు ప్రత్యర్థి న్యూజిలాండ్‌ ఒత్తిడిలో పడకుండా ఉంటే గట్టి పోటీ ఇస్తుందని అభిప్రాయపడ్డాడు.

మేజర్‌ టోర్నీల్లో న్యూజిలాండ్‌ సాధారణంగా ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందని, ఈ విషయం గతంలో చాలా సందర్భాల్లో నిజమైందని ఆయన అన్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌లో భారతే ఫేవరెట్‌ అని అక్తర్‌ స్సష్టం చేశాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న రోహిత్‌ శర్మను అక్తర్‌ ప్రశంసలతో ముంచెత్తాడు

రోహిత్‌ శర్మ షాట్‌ సెలక్షన్‌, టైమింగ్‌ అత్యద్భుతంగా ఉందని అన్నాడు. రోహిత్‌ గేమ్‌ను అర్థం చేసుకునే తీరు అమోఘమని అక్తర్ అన్నాడు. కీలక సమయంలో  కేఎల్‌ రాహుల్‌ కూడా సెంచరీతో ఆకట్టుకోవడం శుభ పరిణామని అభిప్రాయపడ్డాడు.

click me!