సారథిగా సెంచరీ, ఆటగాడిగా డబుల్ సెంచరీ....మోర్గాన్ సరికొత్త రికార్డు

By Arun Kumar PFirst Published May 31, 2019, 12:29 AM IST
Highlights

స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్ సరికొత్త రికార్డు సాధించాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ మోర్గాన్ కెరీర్లో 200వ వన్డే కావడం విశేషం. ఇలా ఇంగ్లాండ్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్ గా మోర్గాన్ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. 

ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున అత్యధిక వన్డేలాడిన ఘనత మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్ వుడ్ పేరిట వుంది. అతడు 197 వన్డేలాడగా ఆ రికార్డును తాజాగా మోర్గాన్ బద్దలుగొట్టాడు. ఆ తర్వాత స్థానాల్లో జేమ్స్ అండర్సన్(194), స్టివార్ట్‌(170), ఇయాన్‌ బెల్‌(161)లు నిలిచారు. 

ఇక తన కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే డబుల్ సెంచరీ వన్డేలో మోర్గాన్ మరో మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో సాధించిన  హాఫ్ సెంచరీతో అతడి ఖాతాలో ఏడు వేల పరుగులు చేరాయి. 

ఆటగాడిగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్ కెప్టెన్ గా కూడా సెంచరీ మైలురాయిని  అందుకున్నాడు. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ 101వది. ఇలా ఎన్నో రికార్డులకు కారణమైన ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 104 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.    
   
click me!