అఫ్గాన్‌తో మ్యాచ్: ఒత్తిడిలో అంపైర్ల మీదకు వెళ్ళిన కోహ్లీ, జరిమానా

By Siva KodatiFirst Published Jun 23, 2019, 4:48 PM IST
Highlights

ఉత్కంఠ పోరులో ఆఫ్గనిస్తాన్‌పై విజయాన్ని సాధించి మంచి జోష్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. మ్యాచ్ సందర్భంగా అంపైర్లతో వాగ్వాదం, దురుసు ప్రవర్తన కారణంగా కోహ్లీకి జరిమానా విధించింది.

మహ్మద్ షమీ వేసిన ఓవర్‌లో ఒక బంతి అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ హజ్రతుల్లా ప్యాడ్స్‌కు తగిలింది. భారత ఆటగాళ్లంతా అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో ధోనీ, షమీలతో చర్చించిన కోహ్లీ అనంతరం డీఆర్ఎస్ కోరాడు.

అయితే బంతి ఔట్ సైడ్ పిచ్ అవ్వడంతో థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే మొగ్గు చూపాడు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోహ్లీ.. అంపైర్ అలీమ్ దార్‌తో వాదించాడు. ఆ బంతి వికెట్లపైకి వెళుతున్నా ఎందుకు ఔట్ ఇవ్వలేదంటూ దురుసుగా ప్రవర్తించాడు.

బంతి వికెట్ పైకి వెళుతుందంటూ వాదించాడు. ఇలా అంపైర్లతో ఒక ఆటగాడు వాదనకు దిగడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కావడంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తూ రిఫరీ క్రిస్ బ్రాడ్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో కోహ్లీ ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ కూడా పడింది. 

click me!