మైదానంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. మ్యాచ్ కి అంతరాయం

Published : Jul 04, 2019, 12:39 PM ISTUpdated : Jul 04, 2019, 12:43 PM IST
మైదానంలోకి నగ్నంగా దూసుకొచ్చిన అభిమాని.. మ్యాచ్ కి అంతరాయం

సారాంశం

ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఈ సంఘటన ప్రపంచకప్ లో చోటుచేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బుధవారం తలపడ్డాయి. 

ఓ అభిమాని అత్యుత్సాహం కారణంగా మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఈ సంఘటన ప్రపంచకప్ లో చోటుచేసుకుంది. వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు బుధవారం తలపడ్డాయి. కాగా... కివీస్ జట్టు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సెక్యురిటీ సిబ్బంది కళ్లు గప్పి ఓ అభిమాని మైదానంలో దూసుకువచ్చాడు. అతని శరీరంపై దుస్తులు కూడా లేకపోవడం గమనార్హం.

అతని చర్యకి ఆటగాళ్లతోపాటు మ్యాచ్ వీక్షిస్తున్న అభిమానులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో... అతనిని అక్కడి నుంచి పంపించడానికి కొంత సమయం పట్టింది. అంత సేపు మ్యాచ్ కి అంతరాయం కలిగింది. ఆ సమయంలో టామ్‌ లాథమ్‌, మిచెల్‌ సాంట్నర్‌ క్రీజులో ఉన్నారు. వారి ఎదుటకు చేరిన ఆ అభిమాని చిందులు వేశాడు. తేరుకున్న భద్రతా సిబ్బంది తొలుత అతన్ని అవతారాన్ని బట్టలో కప్పేశారు. అనతంరం.. బయటికి లాక్కెళ్లారు. 

అయితే, సెక్యురిటీ సిబ్బంది అలక్ష్యం, వారు నింపాదిగా స్పందించిన తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇక 306 పరుగుల టార్గెట్‌తో ఇన్నింగ్స్‌ ఆరంభించిన కివీస్‌ అప్పటికీ 145/6 గా ఉంది. కాగా, ఈ మ్యాచ్‌లో 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్‌ సెమీస్‌ చేరింది. 
 
 

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!