అదే మా కొంప ముంచింది... సర్ఫరాజ్

By telugu teamFirst Published Jul 6, 2019, 1:22 PM IST
Highlights

వరల్డ్ కప్ లో పాక్ చాప్టర్ ఇక ముగిసిపోయింది. పాకిస్తాన్ సెమీస్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. కాగా... వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ ఓడిపోవడం వల్లే ఇలా జరిగిందని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అభిప్రాయపడ్డారు.  

వరల్డ్ కప్ లో పాక్ చాప్టర్ ఇక ముగిసిపోయింది. పాకిస్తాన్ సెమీస్ ఆశలన్నీ గల్లంతయ్యాయి. కాగా... వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ ఓడిపోవడం వల్లే ఇలా జరిగిందని ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అభిప్రాయపడ్డారు.  ఆ మ్యాచే తమ కొంప ముంచిందని ఆవేదన వ్యక్తం చేశాడు.


తమ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చినా అదృష్టం కలిసిరాలేదని తెలిపాడు. ఇక పాకిస్తాన్‌ 5 మ్యాచ్‌లు గెలిచి 11 పాయింట్లు సాధించినప్పటికీ నెట్‌ రన్‌రేట్‌ లేని కారణంగా ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకోగా.. 11 పాయింట్లే ఉన్న న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరింది. అయితే విండీస్‌తో ఘోర ఓటమే పాక్‌కు రన్‌రేట్‌ లేకుండా చేసింది

శుక్రవారం వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ విజయం సాధించింది. కాగా.. ఈ మ్యాచ్ విజయం సాధించిన అనంతరం సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడాడు. ‘గత నాలుగు మ్యాచ్‌ల్లో మేం అద్భుతంగా ఆడాం. కానీ దురదృష్టవశాత్తు మేం సెమీస్‌ బెర్త్‌ అందుకోలేకపోయాం. వెస్టీండీస్‌తో జరిగిన మ్యాచే మాకు నష్టం కలిగించింది. భారత్‌తో ఓటమి ఆనంతరం ఆటగాళ్ల పోరాటం అద్భుతం. ఆరంభంలో మాజట్టు కూర్పు కూడా బాగాలేదు.’’ అని ఒప్పుకున్నాడు.

‘‘ తర్వాతి మ్యాచుల్లో జట్టులో బలాన్ని పెంచుకున్నాం. మా తప్పులను గుర్తించి దానికనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. మాకు సుమారు రెండు నెలల సమయం దొరికింది. ఇక టోర్నీ ఆసాంతం మద్దతు పలికిన అభిమానులకు ధన్యవాదాలు’ అని సర్ఫరాజ్‌ తెలిపాడు. 

click me!