సెమీ ఫైనల్: టీం ఇండియాకి సైనా బెస్ట్ విషెస్

Published : Jul 09, 2019, 01:13 PM ISTUpdated : Jul 09, 2019, 01:15 PM IST
సెమీ ఫైనల్: టీం ఇండియాకి సైనా బెస్ట్ విషెస్

సారాంశం

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... టీం ఇండియాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రపంచకప్ లో భాగంగా ఈ రోజు టీం ఇండియా.. న్యూజిలాండ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే.

బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... టీం ఇండియాకి బెస్ట్ విషెస్ తెలియజేశారు. ప్రపంచకప్ లో భాగంగా ఈ రోజు టీం ఇండియా.. న్యూజిలాండ్ తో తలపడుతున్న సంగతి తెలిసిందే. మంచెస్టర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు... ఫైనల్స్ కి వెళుతంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ మ్యాచ్ టీం ఇండియా గెలవాలని ప్రతి ఒక్క ఇండియన్ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సైనా నెహ్వాల్ ట్విట్టర్ వేదికగా టీం ఇండియా బెస్ట్ విషెస్ చెప్పారు. అదేవిధంగా కేంద్ర  మంత్రి కిరణ్ రిజిజు కూడా ట్విట్టర్ వేదికగా కోహ్లీ టీం కి బెస్ట్ విషెస్ తెలియజేశారు. టీం ఇండియాకే వరల్డ్ కప్ దక్కాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు.

ఈ వరల్డ్ కప్ లో టీం ఇండియా విజయం సాధిస్తే... ప్రపంచకప్ ట్రోపీ అందుకోవడం మూడోసారి అవుతుంది. ఇదిలా ఉంటే.. మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానున్నప్పటికీ... మ్యాచ్ జరుగుతుందా లేదా అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ని వరుణుడు అడ్డుకునే అవకాశం చాలా ఉందని వాతావరణ శాఖ అధికారులు  చెబుతున్నారు. మరి ఏం జరగుతుందో చూడాలి. 
 

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!