షమీ ముస్లిం అనే... పాక్ క్రికెట్ విశ్లేషకుల వక్ర బుద్ధి

By telugu teamFirst Published Jul 8, 2019, 12:54 PM IST
Highlights

పాక్ క్రికెట్ విశ్లేషకులు వక్ర బుద్ధి బయటపెట్టారు. టీం ఇండియా క్రికెటర్ షమీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. షమీ ముస్లిం కాబట్టే.. అతనిని మ్యాచ్ కి దూరం పెట్టారని పాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పాక్ క్రికెట్ విశ్లేషకులు వక్ర బుద్ధి బయటపెట్టారు. టీం ఇండియా క్రికెటర్ షమీ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. షమీ ముస్లిం కాబట్టే.. అతనిని మ్యాచ్ కి దూరం పెట్టారని పాక్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంతకీ మ్యాటరేంటంటే...  ఇటీవల టీం ఇండియా, శ్రీలంక మ్యాచ్ లో షమీని పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. అయితే.. అతను ముస్లిం కాబట్టే.. పక్కన పెట్టేశారని వ్యాఖ్యానించారు. 

భువనేశ్వర్‌ కుమార్‌ గాయంతో జట్టులోకి వచ్చిన షమీ అద్భుతంగా రాణించాడని, మూడు మ్యాచ్‌ల్లోనే 14 వికెట్లు పడగొట్టాడని పేర్కొన్నారు. అలాంటి ఆటగాడిని కాదని, గాయం నుంచి కోలుకున్న భువనేశ్వర్‌కు అవకాశం కల్పించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 

బీజేపీ ఒత్తిడితోనే ముస్లిం అయిన షమీని పక్కకు పెట్టారని, ముస్లిం ఎదగవద్దనే ఎజెండాలో భాగంగానే విశ్రాంతి కల్పించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచకప్‌ నేపథ్యంలో ఓ పాక్‌ చానెల్‌ నిర్వహించిన డిబేట్‌లో ఆ దేశ క్రికెట్‌ విశ్లేషకులు మాట్లాడిని ఈ మాటలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి.

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ అబ్దుల్‌ రజాక్‌ ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ముస్లిం అయిన షమీ ఒక్కడే ఇంగ్లండ్‌పై పోరాడాడని, మిగతా బౌలర్లు ఏమాత్రం రాణించలేకపోయారని వ్యాఖ్యానించాడు. ఇక శ్రీలంకతో మ్యాచ్‌లో చహల్‌, షమీ స్థానాల్లో జడేజా, భువనేశ్వర్‌ తుది జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.  మరి పాక్ కామెంట్స్ పై టీం ఇండియా, బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.

click me!