నాకు పాండ్యా చెప్పిన ట్రిక్ అదే.. కోహ్లీ

By telugu teamFirst Published Jun 11, 2019, 2:54 PM IST
Highlights

ప్రపంచకప్ లో టీం ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తనకు ఓ ట్రిక్ చెప్పాడని... ఆ ట్రిక్... తమ జట్టు విజయానికి సహాయపడిందని కోహ్లీ తెలిపారు.
 

ప్రపంచకప్ లో టీం ఇండియా దూసుకుపోతోంది. ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించింది. ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా తనకు ఓ ట్రిక్ చెప్పాడని... ఆ ట్రిక్... తమ జట్టు విజయానికి సహాయపడిందని కోహ్లీ తెలిపారు.

తాను 50 పరుగులు చేశాక.. పాండ్యా తన వద్దకు వచ్చి.. తాను హిట్టింగ్ చేస్తానని చెప్పాడని కోహ్లీ గుర్తు చేసుకున్నాడు. తాను మరో ఎండ్ లో సింగిల్స్ చేస్తే పాండ్యా స్వేచ్ఛగా హిట్టింగ్ చేస్తానని చెప్పాడని.... అతను చెప్పిన ఆలోచన తనకు బాగా నచ్చిందని కోహ్లీ తెలిపాడు. 

‘హార్దిక్‌ పాండ్య, ధోనీ ఆడుతున్నంత సేపూ నేను సింగిల్స్‌కే పరిమితమయ్యా. వాళ్లు హిట్టింగ్‌ చేస్తుంటే నాకే ఇబ్బంది కలగలేదు. మరో ఎండ్‌లో వికెట్లు కాపాడుకుంటూ సింగిల్స్‌ తీయడంపైనే దృష్టిసారించా. అయితే మిడిల్‌ఆర్డర్‌లో ఎవరెలా ఆడాలో జట్టు యాజమాన్యం ముందే చర్చించింది. పరిస్థితులకు తగట్టు ఆడి పరుగులు సాధించేందుకు ఆటగాళ్లకి అవగాహన వచ్చింది. ఇక్కడ గత మ్యాచ్‌లో 330 పరుగులు చేసి శ్రీలంక చేతిలో ఓడిపోయాం. కాబట్టి ఈసారి పెద్ద స్కోర్‌ చెయ్యాలని ముందే అనుకున్నాం. అందుకు తగ్గట్టే ధావన్‌ ఔటయ్యాక హార్దిక్‌ను బ్యాటింగ్‌కు పంపించాం. ఇది ఎంతో అమూల్యమైన సూచనగా భావిస్తున్నా’ అని కోహ్లీ పేర్కొన్నాడు.

ఇక గురువారం టీం ఇండియా న్యూజిలాండ్ తో... ఆదివారం పాకిస్థాన్ తో తల పడనుంది. ఈ రెండు మ్యాచ్ లు కూడా గెలిస్తే... టీం ఇండియా మొదటిస్థానంలో దూసుకోవడం గ్యారెంటీ. 

click me!