సెమీ పైనల్లో ఇండియా ఓటమి: తెరపైకి అంబటి రాయుడి పేరు

By telugu teamFirst Published Jul 11, 2019, 4:48 PM IST
Highlights

ధోనీని 7వ బ్యాట్స్‌మెన్‌గా ధోనీని పంపడం వ్యూహాత్మక తప్పిదమని టీమిండియా మాజీ క్రికెటర్స్ లక్ష్మణ్, గంగూలీ అభిప్రాయపడ్డారు. కాస్తా ముందుగా ధోనీని బ్యాటింగ్ కు దింపాల్సిందని సచిన్ టెండూల్కర్ కూడా అభిప్రాయపడ్డారు. కొందరు నెటిజన్లు మాత్రం ఊహించని వాదనను ముందుకు తెచ్చారు.

మాంచెస్టర్: ప్రపంచ కప్ టోర్నీ సెమీ ఫైనల్ మ్యాచులో ఇండియా ఓడిపోవడంతో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడి పేరు తెరపైకి వచ్చింది. ప్రపంచ కప్ టోర్నీ ఎంపికైన జట్టులో తనకు స్థానం కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైన రాయుడు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ధోనీని 7వ బ్యాట్స్‌మెన్‌గా ధోనీని పంపడం వ్యూహాత్మక తప్పిదమని టీమిండియా మాజీ క్రికెటర్స్ లక్ష్మణ్, గంగూలీ అభిప్రాయపడ్డారు. కాస్తా ముందుగా ధోనీని బ్యాటింగ్ కు దింపాల్సిందని సచిన్ టెండూల్కర్ కూడా అభిప్రాయపడ్డారు. కొందరు నెటిజన్లు మాత్రం ఊహించని వాదనను ముందుకు తెచ్చారు. 

టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన అంతర్గత రాజకీయాల వల్ల అంబటి రాయుడు వరల్డ్ కప్‌కు, జట్టుకూ దూరమయ్యాడని, రాయుడు ఉండి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అంటున్నారు. న్యూజిలాండ్‌పై రాయుడుకు మంచి రికార్డ్ ఉందని గుర్తు చేస్తున్నారు. 

న్యూజిలాండ్‌పై ఈ ఏడాది ఆరంభంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 18 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయిన స్థితిలో అంబటి రాయుడు 113 బంతుల్లో 90 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడని గుర్తు చేశారు. 

అటువంటి క్రికెటర్ ను వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవడం ఏమిటని నెటిజన్లు మండిపడుతున్నారు. సెమీస్‌లో టీమిండియా ఓటమికి ఇదే బలమైన కారణమని అంటున్నారు.

click me!