కోహ్లీ తప్పేమీ లేదు: కివీస్ పై ఓటమి మీద స్టీవ్ వా, ధోనీకి బాసట

By telugu teamFirst Published Jul 13, 2019, 11:54 AM IST
Highlights

వన్డేల్లో ధోనీ జీనియస్ అని, అతను నీకు అవకాశం కల్పిస్తాడని స్టీవ్ వా అన్నారు. న్యూజిలాండ్ పై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో రన్నవుటయ్యే వరకు ధోనీ ఇండియాను గెలిపించే పరిస్థితే ఉందని ఆన అన్నారు.

లండన్: బ్యాటింగ్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా మద్దతుగా నిలిచాడు. ధోనీ రిటైరయ్యే సమయం వచ్చిందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో స్టీవ్ వా ఆయనను సమర్థించారు. ట్రాఫాల్గర్ స్క్వేర్ లో క్రిలియో కప్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా శుక్రవారం కొద్ది మంది మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. 

వన్డేల్లో ధోనీ జీనియస్ అని, అతను నీకు అవకాశం కల్పిస్తాడని స్టీవ్ వా అన్నారు. న్యూజిలాండ్ పై జరిగిన ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో రన్నవుటయ్యే వరకు ధోనీ ఇండియాను గెలిపించే పరిస్థితే ఉందని ఆన అన్నారు. ధోనీ ఏం చేస్తున్నాడనే విషయంపై అనుమానాలు అవసరం లేదని ఆయన అన్నారు. 

ధోనీ ఆట తీరుపై తనకు ఇంకా నమ్మకం ఉందని ఆయన అన్నారు.  మిడిల్ ఆర్డర్ లో ధోనీ ఇండియాకు అందించిన సేవ అద్భుతమని ఆయన అన్నారు. న్యూజిలాండ్ పై జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో ధోనీ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు పంపించడంపై వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు 

ఆ రోజు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఏ విధమైన వైఫల్యం లేదని స్టీవ్ వా అన్నారు. కోహ్లీ వ్యూహాత్మక తప్పిదాలేమీ చేయలేని అన్నాడు. న్యూజిలాండ్ అద్భుతంగా ఆడిందని, ధోనీని రన్నవుట్ చేసిన గుప్తిల్ బంతి విసిరిన తీరును చూస్తే ఆ విషయం అర్థమవుతుందని అన్నారు. కానే విలియమ్సన్, రాస్ టైలర్ కు క్రెడిట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు. 

click me!