రాయుడు.. కోహ్లీకి భజన చేయలేదు.. అందుకే..

Published : Jul 04, 2019, 10:23 AM IST
రాయుడు.. కోహ్లీకి భజన చేయలేదు.. అందుకే..

సారాంశం

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు... తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ లు, అన్ని స్థాయిల ఆటలకు గుడ్ బై చెబుతుటన్నట్లు బుధవారం ప్రకటించాడు. 

ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు... తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ లు, అన్ని స్థాయిల ఆటలకు గుడ్ బై చెబుతుటన్నట్లు బుధవారం ప్రకటించాడు. రెండు సార్లు అవకాశం వచ్చినా కూడా.. తనను టీం ఇండియాలోకి సెలక్టర్లు తీసుకోకపోవడాన్ని అంబటి రాయుడు జీర్ణించుకోలేకపోయాడు.

స్టాండ్ బై క్రికెటర్ గా ఉన్న తనను పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం కల్పించాడు. దీంతో... బాగా హర్ట్ అయిన అంబటి రాయుడు... రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే... ఈ రిటైర్మెంట్ ప్రకటించడానికి తెర వెనుక కోహ్లీ నే కారణమంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

కోహ్లీ కారణంగానే అంబటి రాయుడుకి ప్రపంచకప్ లో అవకాశం ఇవ్వలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీపై విపరీతంగా మండిపడుతున్నారు. కోహ్లీ రాజకీయాల్లోకి వెళ్లి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ప్రతిభ ఉన్న ఆటగాడిని పక్కన పెట్టేశారని ఆరోపిస్తున్నారు. 

తనకు భజన చేసే క్రికెటర్లను మాత్రమే కోహ్లి ప్రోత్సహిస్తాడని, అశ్విన్‌, జడేజా, అంబటి రాయుడు కెరీర్‌ను కోహ్లియే నాశనం చేశాడని, ఆర్సీబీలో తనతోపాటు ఆడుతున్నందుకే చాహల్‌, కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లకు అవకాశాలు కల్పిస్తున్నాడని ఓ నెటిజన్ మండిపడ్డాడు.

PREV
click me!

Recommended Stories

కప్ పోయిందన్న బాధ ముఖంపై లేదు: విలియమ్సన్‌పై సచిన్ ప్రశంస
ప్రపంచకప్ హీరోలకు ర్యాంకుల పంట, టాప్ ప్లేస్‌ కోహ్లీదే..!!