కావాలని చేయలేదు, విలియమ్సన్ కు క్షమాపణలు చెప్తూనే ఉంటా: స్టోక్స్

By telugu teamFirst Published Jul 15, 2019, 10:33 AM IST
Highlights

బంతి తన బ్యాట్ కు తాకి బౌండరీ దాటిన ఘటనపై విలియమ్సన్ కు క్షమాపణలు చెబుతున్నట్లు స్టోక్స్ చెప్పాడు. అయితే విజయం కోసం తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని, ఎన్నో మాటలు పడిందని అన్నాడు.  చివరికి తాము అనుకున్నది సాధించామని తెలిపాడు.

లండన్‌:  న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కానే విలియమ్సన్‌కు తాను జీవితాంతం క్షమాపణలు చెప్తూనే ఉంటానుని ఇంగ్లాండు స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్అన్నాడు. ఇది తాను కావాలని చేసింది కాదని, బంతి అలా అనుకోకుండా తన బ్యాట్‌ను తాకిందని ఆయన వివరణ ఇచ్చుకున్నాడు. అయితే అదే తమ గెలుపులో కీలకంగా మారిందని అన్నాడు 

బంతి తన బ్యాట్ కు తాకి బౌండరీ దాటిన ఘటనపై విలియమ్సన్ కు క్షమాపణలు చెబుతున్నట్లు స్టోక్స్ చెప్పాడు. అయితే విజయం కోసం తమ జట్టు నాలుగేళ్లుగా ఎంతో కష్ట పడిందని, ఎన్నో మాటలు పడిందని అన్నాడు.  చివరికి తాము అనుకున్నది సాధించామని తెలిపాడు. ఇలాంటి మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలో మరోటి ఉంటుందని తాను అనుకోవడం లేదని అన్నాడు.

ప్రపంచ కప్ 2019 ఫైనల్‌ మ్యాచ్‌ క్రికెట్‌ చరిత్రలోనే  అద్భుతమైందిగా నిలుస్తుంది. ప్రపంచకప్‌ ఫైనల్‌ టై కావడం ఒక్కటైతే, తర్వాత జరిగిన సూపర్‌ ఓవర్‌ సైతం టై కావడం తీవ్ర ఉత్కంఠకు దారి తీసింది. ఇది అరుదైన ఘటన కూడా. 

అయితే మ్యాచ్‌ను టైగా మార్చింది మాత్రం ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌. చివరి ఓవర్లో ఇంగ్లాండ్‌ మూడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా కప్పు గెలవడానికి న్యూజిలాండ్‌కే ఎక్కువ అవకాశాలని అందరూ భావించారు.

స్టోక్స్‌ ఫోర్‌ కొట్టాలని చూసిన బంతి గుప్తిల్‌కు దొరికింది. త్రో విసిరాడు, క్రీజును అందుకునేందుకు దూకిన స్టోక్స్‌ బ్యాటును ఆ బంతి తాకింది. దాంతో బంతి ఓవర్‌ త్రో రూపంలో బౌండరీ దాటింది. ఆరు పరుగులొచ్చాయి. ఆ బంతి అలా స్టోక్స్‌ బ్యాటుకు తగలకపోయి ఉంటే ఫలితం మరో విధంగా ఉండేది.

కప్పు న్యూజిలాండ్‌ వశమై ఉండేది కూడా. కానీ త్రో రూపంలో వచ్చిన ఆరు పరుగులు ఇంగ్లాండ్‌కు కలిసి వచ్చాయి. ఇంగ్లాండ్‌ విజయం తర్వాత బెన్‌ స్టోక్స్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

click me!