అన్న హత్యకు దారితీసిన తమ్ముడి ప్రేమ..

Bukka Sumabala   | Asianet News
Published : Oct 30, 2020, 09:30 AM ISTUpdated : Oct 30, 2020, 09:31 AM IST
అన్న హత్యకు దారితీసిన తమ్ముడి ప్రేమ..

సారాంశం

తమ్ముడి ప్రేమ అన్న దారుణ హత్యకు గురైన సంఘటన అబిడ్స్‌ షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్‌ చంద్రకిరణ్‌ బస్తీకి చెందిన తారయ్యకు మధు(22), అరవింద్‌(17) ఇద్దరు కుమారులు. 

తమ్ముడి ప్రేమ అన్న దారుణ హత్యకు గురైన సంఘటన అబిడ్స్‌ షాహినాయత్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. ఇన్‌స్పెక్టర్‌ చాంద్‌పాషా కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పురానాపూల్‌ చంద్రకిరణ్‌ బస్తీకి చెందిన తారయ్యకు మధు(22), అరవింద్‌(17) ఇద్దరు కుమారులు. 

మధు పనీపాటా లేకుండా జులాయిగా తిరిగేవాడు.  ఆరు నెలల క్రితం ఓ దొంగతనం కేసులో అరెస్టై జైలుకు కూడా వెళ్లివచ్చాడు. ఈ నేపథ్యంలో మధు తమ్ముడు అరవింద్ అదే బస్తీలో ఉంటున్న తమ బంధువు ప్రకాష్‌ కుమార్తెతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం ప్రకాష్‌ కుటుంబ సభ్యులకు తెలియడంతో బుధవారం ప్రకాష్ తన సోదరులతో కలిసి మధు ఇంటికి వెళ్లి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. 

అయితే అరవింద్‌ మొండిగా నేను ఆమెను ప్రేమిస్తున్నానని, విననని తేల్చేశాడు. దీంతో బుధవారం అర్ధరాత్రి ప్రకాష్ బంధువులు ముగ్గురు అరవింద్‌ ఇంటికి వెళ్లి బయటికి రావాలని తలుపులు విరగ్గొట్టారు. అరవింద్‌ బయటికి రావడంతో ముగ్గురు కలిసి అతడిపై మారణాయుధాలతో దాడిచేశారు.

ఈ గొడవకు అక్కడికి వచ్చిన మధు  వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారు ముగ్గురు మధుపై దాడికి దిగారు. ఇదే అదనుగా అరవింద్‌ పారిపోయాడు. మధు కూడా తప్పించుకునే ప్రయత్నం చేయగా ముగ్గురు అతడిపై కత్తి, రాడ్లతో దాడి చేయడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. 

కాగా నిందితులు ముగ్గురు నేరుగా స్టేషన్‌కు వెళ్లి మధు, తన తమ్ముడు అరవింద్‌ తమపై దాడిచేశారని  ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మధు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?