టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్‌కు రూ.2 వేల జరిమానా విధించిన కోర్టు

By narsimha lodeFirst Published Sep 18, 2019, 3:29 PM IST
Highlights

కోర్టు ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగా అమలు  చేయనందుకు గాను టీఎస్‌పీఎస్‌సీ ఛైర్మెన్ కు తెలంగాణ హైకోర్టు జరిమానాను విధించింది.

హైదరాబాద్: తెలంగాణాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మెన్  ఘంటా చక్రపాణి, సెక్రటరీ వాణీ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టు  రూ. 2000ల జరిమానా విధించింది.

జస్టిస్ ఎంఎస్ రామచంద్రారావు ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. 616 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ను 2017లో విడుదలైంది.ఈ విషయంలో టీఎస్‌‌పీఎస్‌సీ అధికారులకు ఆరు వారాల పాటు జైలు శిక్షతో పాటు జరిమానాను విధించింది.

అంతేకాదు టీఎస్‌పీఎస్‌సీ సెక్రటరీ వాణీ ప్రసాద్ సర్వీస్ రికార్డుల్లో ఈ అంశాన్ని నమోదు చేయాలని కూడ కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉద్దేశ్యపూర్వకంగా కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు ఈ ఆదేశాలను జారీ చేసింది.

2017 ఏప్రిల్ మాసంలో  టీఎస్‌పీఎస్‌సీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేష్ ఇచ్చింది.  అదే ఏడాది మే మాసంలో రాత పరీక్షలను నిర్వహించారు.

ఈ పరీక్షలు రాసిన వారు కొందరు 2017లో హైకోర్టును ఆశ్రయించారు.దీంతో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కోర్టు గతంలో టీఎస్‌పీఎస్ సీ అధికారులకు జరిమానాలతో పాటు, ఆరు వారాల జైలు శిక్షలను విధించింది. అయితే ఈ శిక్షలను ఉద్దేశ్యపూర్వకంగా అమలు చేయనందున టీఎస్‌పీఎస్‌పీ ఛైర్మెన్ ఘంటా చక్రపాణితో పాటు సెక్రటరీ వాణికి జరిమానాను విధించింది కోర్టు.

click me!