బాత్‌రూమ్‌లో డెలీవరి... శిశువును వదిలేసిన తల్లి

Siva Kodati |  
Published : Sep 24, 2019, 05:23 PM ISTUpdated : Sep 24, 2019, 05:24 PM IST
బాత్‌రూమ్‌లో డెలీవరి... శిశువును వదిలేసిన తల్లి

సారాంశం

హైదరాబాద్ రసూల్‌పురాలో దారుణం జరిగింది. ఓ యువతి గర్భస్రావం కోసం ఆసుపత్రికి వచ్చి బాత్‌రూమ్‌లో శిశువును ప్రసవించింది.

హైదరాబాద్ రసూల్‌పురాలో దారుణం జరిగింది. ఓ యువతి గర్భస్రావం కోసం ఆసుపత్రికి వచ్చి బాత్‌రూమ్‌లో శిశువును ప్రసవించింది. వివరాల్లోకి వెళితే.. ఓ అవివాహిత అబార్షన్ కోసం సోమవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు హోమియో వైద్యుడిని సంప్రదించింది.

ఆమెను పరీక్షించిన సదరు వైద్యుడు కొన్ని మందులు ఇవ్వడంతో బాధితురాలు వాటిని వేసుకుంది. అయితే తీవ్రంగా కడుపునొప్పి రావడంతో క్లినిక్ పక్కనే ఉన్న ఇంట్లోని బాత్‌రూమ్‌కి వెళ్లి అక్కడే ఆమె శిశువును ప్రసవించింది.

అనంతరరం బిడ్డను అక్కడే వదిలేసి తీవ్ర రక్తస్రావంతో బయటకు వచ్చింది. దీనిని గమనించిన ఇంటి యజమాని వైద్యుడికి సమాచారం అందించగా.. ఆయన అక్కడికి వచ్చి పరిశీలించగా శిశువు అప్పటికే మరణించింది.

దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించి.. పరారీలో ఉన్న వైద్యుడి కోసం గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ లో బుధవారం నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలు ముందే జాగ్రత్తపడండి
Jubilee Hills లో కాంగ్రెస్ గెలవడానికి టాప్ 10 రీజన్స్ ఇవే...