హైదరాబాదులోని మాదన్నపేటలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిర్వాకం వల్ల ఒకే అపార్టుమెంటులోని 23 మందికి కరోనా వైరస్ సోకింది. అతని బర్త్ డే వేడుకల కారణంగా 23 మందికి కరోనా వైరస్ వచ్చింది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఒకరి నుంచి చాలా మందికి కరోనా వైరస్ విస్తరిస్తన్న జాడలు బయటపడుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ గ్రేటర్ హైదరాబాదులో మాత్రం కేసులు పెరుగుతున్నాయి.
తాజాగా అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం వెలుగు చూసింది. మాదన్నపేటలో ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీరు వల్ల 23 మందికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది. సాప్ట్ వేర్ మాదన్నపేటలోని అపార్టుమెంటులో జన్మదిన వేడకలు జరుపుకున్నాడు. దీంతో ఆ ఆపార్టుమెంటులోని 23 మందికి కరోనా వైరస్ సోకింది.
undefined
హైదరాబాదు పాతబస్తీలోని జియగుడా, మంగళ్ హాట్ వంటి ప్రాంతాలు కరోనాకి కేంద్రాలుగా మారుతున్నాయి. ఈ రెండు ప్రాంతాలు కూడా హాట్ స్పాట్లుగా మారాయి. హైదరాబాదులోని నాలుగు జోన్లకు కరోనా వైరస్ పరిమితమైంది. ఎల్బీ నగర్, మలక్ పేట, చార్మినార్, కార్వాన్ జోన్లలో కరోనా వైరస్ విజృంభిస్తోంది.
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతున్నాయి. గురువారంనాడు కొత్తగా 47 కేసులు నమోదయ్యాయి. దాంతో తెలంగాణలో కేసుల సంఖ్య 1,414కు చేరుకుంది. కరోనా వైరస్ తో తెలంగాణలో ఇప్పటి 34 మంది మరణించారు.