టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ పాల్గొన్నారు.
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రముఖ సింగర్ మంగ్లీ పాలుపంచుకున్నారు. సోమవారం మణికొండలోని జీహెచ్ఎంసీ పార్క్ లో ఆమె మూడు మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా మంగ్లీ మాట్లాడుతూ... ఒకప్పుడు మన పూర్వీకులు ఎండాకాలం వచ్చిందంటే చెట్లకింద కూర్చుని చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించేవారని అన్నారు. కానీ ఇప్పుడు మారుతున్న పరిస్థితుల్లో చెట్లు అంతరించిపోతున్నాయని... దీంతో తీవ్ర కాలుష్యం పెరిగి విపరీత పరిస్థితులకు దారితీస్తోందని అన్నారు.
భూమండలం వేడెక్కడానికి కూడా ఈ కాలుష్యమే కారణముతోందన్నారు.
రాజ్యసభ సభ్యుడు సంతోష్ అన్నకు వచ్చిన ఆలోచన చాలా గొప్పదని.... ఆయన ఆలోచనకు తాను సెల్యూట్ తెలుపుతున్నానని అన్నారు. ఇంత మంచి ఆలోచన చేసినందుకు సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంగ్లీ మరొక ముగ్గురికి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. 1) సుడిగాలి సుధీర్ 2)యాంకర్ శ్రీముఖి 3)జార్జి రెడ్డి సినిమా హీరో సందీప్ మాధవ్ లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.