ప్రతిపక్షాలు చేసిన దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టే విధంగా, వారిని ఓడించాలన్న కసితో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ప్రతిపక్షాలు చేసిన దుష్ర్పచారాన్ని తిప్పి కొట్టే విధంగా, వారిని ఓడించాలన్న కసితో ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి భారీ మెజారిటీతో గెలిపించారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ కార్యానిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వంలో సోమవారం హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఆత్మీయ సమావేశంలో సత్యవతి రాథోడ్ ప్రసంగించారు.
undefined
హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఘన విజయంలో తనను భాగస్వామ్యం చేసిన ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి పాదాభివందనాలు, మంత్రి కేటిఆర్ గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపులో భాగస్వామ్యమైన ప్రతి కార్యకర్త, నాయకులందరికీ ఆమె అభినందనలు తెలియజేశారు.
Also read:హుజూర్‌నగర్ విజయం: బీజేపీది గాలివాటమే.. ఆ పార్టీ అసలు బలం ఇదేనన్న కేటీఆర్
ఉప ఎన్నికల సందర్భంగా హుజూర్ నగర్ తండాలలో క్షేత్ర స్థాయిలో తిరిగినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి కేసిఆర్ గారి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేస్తారన్న విషయం తెలిసిందని సత్యవతి గుర్తుచేశారు.
మన పనులను చూసి ఓటేస్తారని సీఎం చెప్పిన విషయం నూటికి నూరుపాళ్లు నిజమని ఈ తీర్పుతో తేలిందన్నారు. ఉప ఎన్నికల్లో తండాల్లో వారి సమస్యలను పరిష్కారం చేయడానికి అనేక హామీలు ఇచ్చామని మంత్రి తెలిపారు.
గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి కేసిఆర్ కృతజ్ణత సభ పెట్టి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని, 100 కోట్ల రూపాయలను మంజూరు చేశారని సత్యవతి రాథోడ్ గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చిన సిఎంకి హుజూర్ నగర్ ప్రజల తరపున ఆమె కృతజ్ణతలు తెలిపారు.
Also Read:ఆర్టీసీ సమ్మెపై వీడని కేసీఆర్ పట్టు: కాంగ్రెసులో హుజూర్ నగర్ సెగ
రాజకీయాల్లో ఓట్లు వేయమని అడగడం తప్పా, ఓట్లిసిన తర్వాత కృతజ్ణత సభ పెట్టి హామీలు నెరవేర్చిన గొప్ప సిఎం కేసిఆరేనని సత్యవతి కొనియాడారు.
తండాలలో పదవులను కాదని ప్రచారంలో పాల్గొన్నప్పుడు మా దగ్గరకు వచ్చిన మంత్రికి కనీసం ఏమి చేయలేకపోయామనుకున్న గిరిజనులు ఓట్లేసి వారి కృతజ్ణతను చాటారని, వారికి రుణపడి ఉన్నామని మంత్రి వెల్లడించారు.
ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇందన శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఉప ఎన్నికల ఇన్ ఛార్జీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు