పాలన సంస్కరణలు ప్రజలకు అందుబాటులోకి తేవాలి: కెటిఆర్

By narsimha lodeFirst Published Sep 11, 2019, 6:33 PM IST
Highlights

మున్సిఫల్ శాఖపై మంత్రి కెటిఆర్ బుధవారం నాడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిఫల్ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. 

హైదరాబాద్:ప్రస్తుతం నడుస్తున్న అభివృద్ది కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు ప్రభుత్వం ప్రారంభించిన పలు పరిపాలన సంస్కరణలను ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కెటీఆర్ అధికారులను కోరారు

బుధవారం నాడు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ మసాబ్ ట్యాంకులోని పురపాలక శాఖ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో  పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, పురపాలక సంచాలకులు శ్రీదేవి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్ లు, హెచ్ యం అర్ ఏల్ యండి ఎన్వీయస్ రెడ్డి, పబ్లిక్ హెల్త్ విభాగాల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

ప్రస్తుతం ఆయా విభాగాల్లో కొనసాగుతున్న కార్యక్రమాలను విభాగాల అధిపతులు వివరించారు. అయా విభాగాల్లో నడుస్తున్న కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టుల పురోగతిని ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన పురపాలక చట్టంలోని సౌకర్యాలను ప్రజలకు వివరించాలన్నారు. 

"

ప్రభుత్వ ఉద్దేశ్యాలు ప్రజలకు అర్ధం అయినప్పుడు అధికారుల్లో పారదర్శకత పెరగడంతోపాటు ప్రజల్లో పురపాలన పట్ల చైతన్యం వస్తుందన్నారు. నూతనంగా ఎర్పడిన పురపాలికల్లో ప్రజలకు నూతన చట్టంపైన మరింత అవగాహణ తేవాలని కోరారు.

మున్సిపాలిటిలపై ప్రభుత్వ అలోచనలను వివరించేందుకు త్వరలోనే అన్ని పురపాలికల కమీషనర్లతో హైదరాబాద్ లో ఒక సమావేశం ఎర్పాటు  చేయాలని కెటిఆర్ పురపాలక అధికారులను అదేశించారు. 

ఈ సమావేశంలో సిడియంఏ శ్రీదేవి రాష్ర్టంలోని మున్సిపాలిటీల్లో చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. ముఖ్యంగా పట్టణాల్లో ఎల్ ఈడీ లైట్ల బిగింపు, పార్కులు ఏర్పాటు, లేఅవుట్లలో ఖాళీ స్థలాల రక్షణ, వినియోగం, ఒపెన్ జిమ్ ల ఏర్పాటు, శ్మశనావాటికల అభివృద్ది(వైకుంఠధామాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వివరించారు. 

పురపాలికల్లో జనసమ్మర్ధం ఉన్న ప్రాంతాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలోనే పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కూమార్  హెచ్ యండిఏ ప్రణాళికలను వివరించారు. 


 

click me!