ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి (వీడియో)

By Siva KodatiFirst Published Sep 10, 2019, 12:52 PM IST
Highlights

ఖైరతాబాద్ మహా గణపతిని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో గణేశ్ మండపం వద్దకు వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు

ఖైరతాబాద్ మహా గణపతిని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులతో గణేశ్ మండపం వద్దకు వచ్చిన ఇంద్రకరణ్ రెడ్డికి ఉత్సవ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి దంపతులు గణపతికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. 

"

కాగా.. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపతి ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నాడు. 12 తలలు, ఏడు అశ్వాలు, 12 సర్పాలతో.. 61 అడుగుల ఎత్తులో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుని ఎత్తును ఏటా అడుగు చొప్పున తగ్గిస్తున్నప్పటికీ.. ఈ సారి 12 తలలతో నిర్మిస్తున్నందున అది 61 అడుగులకు చేరినట్లు గణేశ్ ఉత్సవ కమిటీ తెలిపింది. 

 

"

 

click me!