స్వలింగ సంపర్కం, డబ్బే.. ఇస్రో సైంటిస్ట్ ప్రాణం తీసింది

By Siva KodatiFirst Published Oct 4, 2019, 5:17 PM IST
Highlights

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ సురేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్వలింగ సంపర్కం, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. 

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన ఇస్రో సైంటిస్ట్ సురేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు.

స్వలింగ సంపర్కం, ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు నిర్థారించారు. సైంటిస్ట్ సురేశ్‌ నుంచి ఆశించిన స్థాయిలో డబ్బు రాకపోవడంతో శ్రీనివాస్ అనే వ్యక్తి అతనిని హతమార్చినట్లు వెస్ట్‌జోన్ డీసీపీ సుమతి తెలిపారు.

హత్య చేసే విధానం గురించి నిందితుడు గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. సురేశ్ ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. అమీర్‌పేటలోని ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో శ్రీనివాస్ పనిచేస్తున్నట్లుగా సమాచారం. ఇతని స్వస్థలం పెద్దపల్లి జిల్లా రామగుండం.

నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న సురేశ్ కుమార్‌ అమీర్‌పేట ధరం కరం రోడ్‌లోని అన్నపూర్ణ అపార్ట్‌మెంట్‌లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. 

click me!