హైదరాబాదులో మళ్లీ దంచికొడుతున్న వాన: పెద్ద చెరువుకు ప్రమాదం

By telugu teamFirst Published Oct 19, 2020, 1:15 PM IST
Highlights

హైరదాబాదులో మళ్లీ వర్షం దంచికొడుతోంది. హైదరాబాదులోని బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలింనగర్, సికింద్రాబాదు వంటి ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వానలు కురవడం ప్రారంభమైంది.

హైదరాబాద్: వరణదేవుడు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదుపై పగబట్టినట్లే ఉన్నాడు. కాస్తా తెరిపినిచ్చిందని ఆనందిస్తున్న సమయంలోనే మళ్లీ హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఇప్పటికీ ఇంకా వంద కాలనీలు వరదల్లోనే మునిగి ఉన్నాయి. 

హైదరాబాదులోని పురానాపూల్ వంతెన ప్రమాదకరస్తాయిలో ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజగుట్ట, ఫిలింనగర్ వంటి పలు ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం వర్షం కురవడం ప్రారంభమైంది. మల్కాజిగిరి ప్రాంతంలో కూడా వర్షం పడుతోంది.

Also Read: ‘‘ గంగ వస్తుంది రా’’: హైదరాబాద్ వరదలు.. నిజమైన భవిష్యవాణి మాట (వీడియో)

చార్మినార్, ఎంజె మార్కెట్ వంటి పాత బస్తీలో కూడా వానలు పడుతున్నాయి.  ముంపు ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి. సికింద్రాబాదు, బేగంపేట, తార్నాకాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 

మూసాపేట, కూకట్ పల్లి, సికింద్రాబాదు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మీర్ పేటలోని పెద్ద చెరువు కట్ట తెగే ప్రమాదం ఉంది. ఇసుక బస్తాలు తెచ్చి వేస్తున్నారు. దిగువన ఉన్న కాలనీలను ఖాళీ చేయిస్తున్నారు.

Also read: హైదరాబాద్‌లో విషాదం: రెండ్రోజుల క్రితం వరదలో గల్లంతు.. శవమై తేలిన చిన్నారి 

గుర్రం చెరువు తెగిపోవడంతో హఫీజ్ బాబా నగర్ దాదాపుగా ఖాళీ అయింది. ప్రజలు చాలా మంది ఇతర ప్రాంతాలకు తరలిపోగా, కొంత మంది భవనాల పై అంతస్థుల్లోకి వెళ్లి ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. వాహనాలు కిలోమీటర్ల కొట్టుకునిపోయాయి. వందల వాహనాలు కొట్టుకుని పోయాయి. 

click me!