పాతబస్తీలో అఘాయిత్యం: మహిళ దుస్తులు విప్పేసి, ఆటో డ్రైవర్ అరెస్టు

Published : Dec 17, 2020, 12:46 PM ISTUpdated : Dec 17, 2020, 12:47 PM IST
పాతబస్తీలో అఘాయిత్యం: మహిళ దుస్తులు విప్పేసి, ఆటో డ్రైవర్ అరెస్టు

సారాంశం

హైదరాబాదులోని పాతబస్తీలో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడడమే కాకుండా ఆమెను హత్య చేశాడు. ఆటో డ్రైవర్ ను పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు పాతబస్తీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఓ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. హైదరాబాదులోని పహడీషరీఫ్ లో ఆ ఘటన చోటు చేసుకుంది. 

ఆటో డ్రైవర్ ఫిరోజ్ ను పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో ఫాతిమా అనే మహిళ చాంద్రాయణగుట్ట వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్యమైన ప్రదేశానికి లాక్కెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

దాంతో అతను ఆమెను హత్య చేశాడు. ఆనవాళ్లు గుర్తించకుండా ఆమె ముఖాన్ని ఇటుకతో చెక్కేశాడు. ఆ తర్వాత ఆమె దుస్తులను కాల్చేశాడు. పోలీసులు ఆ కేసును ఛేదించి ఆటో డ్రైవర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

గతంలో హైదరాబాదు సమీపంలో జరిగిన దిశ సంఘటనను పోలి ఉందని అంటున్నారు. దిశ అనే వెటర్నిరీ డాక్టర్ ను దుండగులు రేప్ చేసి, ఆమెను హత్య చేసి, శవాన్ని వేరే చోటికి తరలించి కాల్చే ప్రయత్నం చేశారు. నిందితులు పోలీసుల ఎన్ కౌంటర్ లో మరణించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?