ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచే చిట్కాలు మీ కోసం..

By Mahesh RajamoniFirst Published Mar 20, 2023, 11:43 AM IST
Highlights

రెగ్యులర్ గా వ్యాయామాన్ని చేస్తూ ఒత్తిడిని నియంత్రణలో ఉంచుకుంటే ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరుగుతాయి. అధిక బరువు, ధూమపానం, ఆల్కహాల్ వంటి కారకాలు ఈస్ట్రోజెన్ స్థాయిలను తగ్గిస్తాయి. దీనివల్ల సంతాన సమస్యలు, బలహీనమైన ఎముకలు వంటి సమస్యలు వస్తాయి. 
 

ఈస్ట్రోజెన్ అనేది ఒక హార్మోన్. దీన్ని మన శరీరం సహజంగా ఉత్పత్తి చేస్తుంది. పీరియడ్స్, ఎముక ఆరోగ్యం, సంతానోత్పత్తితో, సెక్స్ సామర్థ్యం సహా అనేక శారీరక విధులలో కీలక పాత్ర పోషిస్తుంది. అయినప్పటికీ..  కొంతమందికి ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఈ హార్మోన్ ను ఎలా పెంచొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆహారాలు

మీరు తినే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చితే కూడా ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. అవిసె గింజలు, నువ్వులు, సోయాబీన్స్, చిక్పీస్ వంటి ఆహారాలలో ఫైటో ఈస్ట్రోజెన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. 

వ్యాయామం

ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచడానికి వ్యాయామం కూడా సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శారీరక శ్రమలో పాల్గొంటే పురుషులు, మహిళలు ఇద్దరిలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనంలో తేలింది. ఎందుకంటే వ్యాయామం శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సహాయపడుతుంది.

ఒత్తిడి స్థాయిలను తగ్గించండి

ఒత్తిడి స్థాయిలు ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజెన్ తో సహా వివిధ హార్మోన్ల స్థాయిలలో అసమతుల్యత ఏర్పడుతుంది. యోగా, ధ్యానం, డీప్ బ్రీత్ వంటి వ్యాయామాలు వంటివి ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన హార్మోన్ స్థాయిలను ప్రోత్సహించడానికి సహాయపడుతాయి.

ఆరోగ్యకరమైన బరువు

శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతే ఈస్ట్రోజెన్ స్థాయిలు బాగా పెరిగిపోతాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అయినప్పటికీ.. బరువు తక్కువగా ఉండటం వల్ల కూడా ఈస్ట్రోజెన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారం తీసుకుంటే మీ బరువు ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువు ఈస్ట్రోజెన్ స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.

ధూమపానం మానేయండి

స్మోకింగ్ ఒక సాధారణ అలవాటు. ఇది మీ హార్మోన్ల స్థాయిలతో సహా మీ ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. సిగరెట్ పొగలో హానికరమైన రసాయనాలు ఉంటాయి. ఇవి ఈస్ట్రోజెన్ తో సహా మీ శరీరంలోని హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయి.

సరైన ఆహారం

ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తినడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు మెరుగుపడతాయి. సోయా గింజలు, టోఫు, చిక్పీస్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు వంటి ఫైటో ఈస్ట్రోజెన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల ఈస్ట్రోజెన్ స్థాయిలు మెరుగుపడతాయి. ఇందుకోసం కాలీఫ్లవర్, బ్రోకలీ, క్రాన్బెర్రీ వంటి కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చండి. 

సప్లిమెంట్స్

ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచడానికి సప్లిమెంట్స్ కూడా సహాయపడతాయి. ఏదేమైనా సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇవి ఇతర మందులతో సంకర్షణ చెందుతాయి. లేదా చెడు ప్రభావాలను కలిగిస్తాయి. 


 

click me!