టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి: దేవళ్ల రేవతి స్పందన ఇదీ...

By telugu team  |  First Published Dec 10, 2020, 10:07 AM IST

గుంటూరు జిల్లాలో టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి స్పందించారు. తాను డీజీపీకి ఫిర్యాదు చేస్తానని రేవతి చెప్పారు.


గుంటూరు: తాను టోల్ ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలపై వడ్డెర కార్పోరే,న్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి స్పందించారు. టోల్ ప్లాజా సిబ్బంది ముందుగా దురుసుగా ప్రవర్తన కారణంగానే తాను కారు దిగాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. 

తాను చట్టం ప్రకారం నడిచే వ్యక్తినని, తన కారుకు రెగ్యులర్ పాస్ ఉందని రేవతి చెప్పారు సదరు టోల్ ప్లాజా సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరడానికి రేవత్ డీజీపీని కలవనున్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. పూర్తి ఆధారాలతో తాను డీజీపికి ఫిర్యాదు చేస్తానని అమె చెప్పారు తాను చట్టవ్యతిరేకమైన పనులు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

See Video: నా కారునే ఆపుతారా: టోల్ గేట్ సిబ్బందిపై దాడి

కాగా, గుంటూరు జిల్లా కాజా టోల్ గేట్ వద్ద వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి వీరంగం సృష్టించారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమెపై ఈ విధమైన వార్తలు వచ్చాయి.... టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేశారు. టోల్ చెల్లించకుండా వెళ్తుండడంతో సిబ్బంది ఆమెను ఆపేశారు. 

తన కారునే అపుతారా అటూ బారికేడ్లు తొలగించి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. తనను టోల్ చెల్లించాలని అడుగుతారా అంటూ సిబ్బందిని దుర్భాషలాడారు. బారికేడ్లను తీసిపారేసి విజయవాడ వైపు వెళ్లారు. 

click me!