టిడిపి అధినేత చంద్రబాబుపై ఆధారాలు లేకుండా దుష్ప్రచారం చేయడం తగదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ వైసిపి నాయకులకు సూచించారు. దమ్ముంటే జగన్ అవినీతి, అక్రమాలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు.
గుంటూరు: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై అవినీతి ఆరోపణలు చేస్తున్న వైసిపి నాయకులు వాటిని నిరూపించగలా అని ఆ పార్టీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. అయితే క్రిమినల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి మీద బహిరంగ చర్చకు తాను సిద్దంగా వున్నాను... వైసిపి నాయకులెవరైనా సిద్దమా? టైం, ప్లేస్ మీరు చెబుతారా? మమ్మల్ని చెప్పమంటారా అని అనురాధ సవాల్ చేశారు.
రాష్ట్రం మొత్తం మీద ఇప్పటివరకు 2,75,117 ఎకరాలను జగన్ స్వాహా చేశారని ఆరోపించారు. అలాగే రూ.16,97,335 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసి 16 కేసుల్లో ముద్దాయిగా ఉన్నారన్నారు. 8 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని... ఇందులో భాగంగా 16 నెలలు జైలు శిక్ష అనుభవించారని పేర్కొన్నారు. జగన్ కు చెందిన 43వేల కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారని గుర్తుచేశారు.
దేశంలోని అత్యున్నత న్యాయస్థానాలు సైతం జగన్ చేసిన అక్రమార్జన చూసి ఆశ్చర్యపోయాయని అన్నారు. జగన్ లాంటి అవినీతి పరుడుని ఎక్కువ కాలం బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సాక్షాత్తు సీబీఐ కోర్టు వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు.
read more మాకేం సంబంధం: చంద్రబాబు మాజీ పిఎస్ ఇంట్లో ఐటి సోదాలపై యనమల
వైసిపి నేతల్లో 87% మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. వారి మీద అవినీతి కేసులన్నాయని తమ మీద కూడ అవినీతి మరకలు రుద్దే ప్రయత్నం వైసిపి చేస్తోందని అన్నారు.
ఐటీ దాడుల్లో రూ.2వేల కోట్లు దొరికాయని వైసిపి నాయకులు డప్పులు కొట్టుకుంటున్నారు... వాటికి తమ పార్టీతో, అధినేత చంద్రబాబుతో ఏం సంబంధం ఉంది? అని ప్రశ్నించారు. ఏమీ లేకపోయినా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
38 వారాల నుంచి జగన్ సీబీఐ కోర్టుకు హాజరుకాకుండా కుంటి సాకులు చెబుతన్నారని... ఈ రోజు కూడా ఆయన కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా అమిత్ షాను కలవాలంటూ ఢిల్లీ చుట్టు చక్కర్లు కొడుతున్నారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా వుండగా చంద్రబాబు నాయుడుపై 26 ఎంక్వైరీలు వేసి కూడా ఏం చేయలేకపోయారని గుర్తుంచుకోవాలన్నారు.
read more దేశంలోనే జగన్ నెంబర్ 1... ప్రపంచ యూనివర్సిటీల్లో ఆయనపై పాఠాలు...: బుద్దా వెంకన్న
ముఖ్యమంత్రిగా వున్నా, ప్రతిపక్ష నేతగా వున్న చంద్రబాబు నాయుడు తన కుటుంబ ఆస్తులను క్రమం తప్పకుండా ప్రతి యేడాది ప్రకటిస్తున్నారని అన్నారు. అలా ఈ ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే ఆస్తులను ప్రకటించాలని అనురాధ సూచించారు.