దమ్ముంటే అలాచేయ్...: సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్

By Arun Kumar PFirst Published Feb 10, 2020, 10:08 PM IST
Highlights

రాష్ట్రాన్ని పాలించడం చేతగాకే పెట్టుబడులు వెనక్కిపోయేలా చేశాడని ముఖ్యమంత్రి జగన్ పై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. 

గుంటూరు: ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు దమ్ముంటే సంపదను సృష్టించి రాష్ట్రాని అభివృద్ధి చేయాలని మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు. రాజధాని అమరావతి ఆంధ్రుల భవిష్యత్ సంపదగా తీర్చిదిద్దుతుంటే జగన్ వచ్చి సర్వనాశనం చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు.  

రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు బుచ్చయ్య చౌదరి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రాజధాని రైతులకు సంఘీభావం తెలిపి మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్ లో చంద్రబాబును కలిసారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రజలు శ్రమకోర్చి రాజధాని రైతుల ఉద్యమానికి సంఘీభావం తెలపడానికి రావడం అభినందనీయమన్నారు. 

''మిమ్మల్ని స్పూర్తిగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు రాజధాని రైతులకు మద్దతు తెలపడం అత్యంత ఆవశ్యకం’’మని  పేర్కొన్నారు. రెండు లక్షల కోట్ల అమరావతి రాజధాని ఆస్తిని నిర్వీర్యం చేసే దుర్మార్గ చర్యలకు జగన్ పూనుకోవడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర సంపదను నాశనం చేయడం మూలంగా 5 కోట్ల ప్రజల భవిష్యత్తును జగన్ మట్టుపెట్టి వికృతానందం పొందుతున్నాడని దుయ్యబట్టారు.  

read more  

రాష్ట్రానికి మధ్యనున్న అమరావతి అందరికీ అందుబాటులో ఉండాలనే ఇక్కడ నిర్మించాలని తలపెట్టామని గుర్తు చేశారు. జగన్, అతని మంత్రులు రోజూ అమరావతిలో టిడిపి చేసిన అభివృద్ధిపై అసత్య , అబద్ధాలు ప్రచారం చేసి ప్రజల్లో అపోహలు సృష్టించడానికి ఆపసోపాలు పడుతున్నారని అన్నారు. 

మూడు రాజధానులంటూ చేస్తున్న తుగ్లక్ చర్యలను జాతీయ పత్రికలూ తప్పుపడుతున్నా జగన్ లో స్పందన లేకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రజలను అష్టకష్టాల పాలు చేసి జగన్ పైశాచిక ఆనందం పొందడం హేయమైన చర్య అన్నారు. రోజుకొక రద్దుతో పాలన, సంక్షేమ కార్యక్రమాల కుదింపుతో ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. 

జగన్ పైశాచిక చర్యలతో రాష్ట్రానికి వచ్చే రూ.1.80 కోట్ల పెట్టుబడులు పొతే అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అభివృద్ధితోనే  ఆదాయం లభించి తద్వారా సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించవచ్చని సూత్రీకరించారు. వ్యక్తి ప్రవర్తనతోనే సమాజం నిర్వీర్యమవుతుందనడానికి ప్రస్తుత జగన్ పాలన ఉదాహరణగా మిగులుతుందన్నారు.  

read more  అందుకోసమే అధికారులపై వేటు... వైసిపి ప్రణాళిక ఇదే...: అచ్చెన్నాయుడు 

రాష్ట్రంలో ప్రభుత్వ భూములు అమ్మి అభివృద్ధి చేస్తాననడం అవివేకమన్నారు. సత్తావుంటే సంపద సృష్టించే విధంగా అభివృద్ధిని సాధించాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో నెలకొన్న జగన్ దుర్మార్గ పాలనతో వెనక్కిపోతున్న అభివృద్ధిపై ప్రజలు అవగాహన చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అవగాహనతో వాస్తవాలను ప్రతి ఒక్కరూ ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. 

అమరావతి రైతుల సమస్య వారోక్కరిది కాదని రాష్ట్ర ప్రజలందరి సమస్యగా భావించి మద్దతు తెలపాలని కోరారు. జగన్ ప్రభుత్వం అసత్యాలు, అబద్దాలతో సాగిస్తున్న పాలనను ఎండగట్టాలని పేర్కొన్నారు. కురుక్షేత్రం యుద్ధంలో న్యాయం, ధర్మ గెలిచినట్లే రాజధాని రైతుల ధర్మ పోరాటం గెలిచి తీరుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్లు జగన్ దుష్ప్రవర్తనతో ప్రజలు ఛీగొట్టే స్థితికి తెచ్చుకున్నానన్నారు. ''నా అవేదన, బాధ 5 కోట్ల ప్రజల భవిషత్తు అంధకారం కాకుండా కాపాడాలనే'' అని చంద్రబాబు పేర్కొన్నారు. 


 

click me!