వైసీపీకి చెందిన జమ్మలమడుగు నేతల మధ్య ఆధిపత్యపోరు అమరావతికి చేరింది. మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి సీఎం జగన్ తో శుక్రవారం నాడు భేటీ అయ్యారు.
అమరావతి: వైసీపీకి చెందిన జమ్మలమడుగు నేతల మధ్య ఆధిపత్యపోరు అమరావతికి చేరింది. మాజీ మంత్రి పి. రామసుబ్బారెడ్డి సీఎం జగన్ తో శుక్రవారం నాడు భేటీ అయ్యారు.ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.
గత ఏడాది రామసుబ్బారెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిన తర్వాత సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది.ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరుకు చెక్ పెట్టేందుకు గాను వైసీపీ నాయకత్వం ప్రయత్నాలను ప్రారంభించింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తో కలిసి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి శుక్రవారం నాడు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. రామకృష్ణారెడ్డిని కలిసిన తర్వాత రామసుబ్బారెడ్డి సీఎం జగన్ ను కూడా కలిశారు. నియోజకవర్గంలో చోటు చేసుకొన్న పరిణామాలను ఆయన సీఎంకు వివరించారు.రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని సజ్జల మీడియాకు తెలిపారు. రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని వైసీపీ వర్గాలు తెలిపాయి.