ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి... పంచుమర్తి అనురాధ డిమాండ్

By Arun Kumar P  |  First Published Dec 30, 2019, 10:17 PM IST

రాజధాని రైతులు ఏమి చేయలేని పరిస్థితిలో తమ బాధలను చెప్పుకుంటే ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.  


గుంటూరు: గత 13రోజుల నుండి రాజధాని రైతులు ఒక అనిశ్చితిలోనే బ్రతుకుతున్నారని దీనికి వైసిపి ప్రభుత్వ విధానాలే కారణమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. తమను 

గెలిపించిన రైతులనే ఆ పార్టీ నాయకులు పెయిడ్‌ ఆర్టిస్టులని హేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గత ఏడు నెలల నుంచి మంత్రి బొత్స నత్తి మాటలతో రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.   

Latest Videos

రాజధాని రైతులు ఏమి చేయలేని పరిస్థితిలో తమ బాధలను చెప్పుకుంటే ఆ ప్రాంత వైసీపీ ఎమ్మెల్యేలు వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి, ఆళ్ల రామకృష్ణను రాజధాని రైతులు, ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇప్పుడు దుర్మార్గంగా మాట్లాడుతున్నారని అన్నారు.

ఉండవల్లి శ్రీదేవి రైతులను పట్టుకొని పెయిడ్‌ ఆర్టిస్టులని మాట్లాడుతున్నారని అనురాధ మండిపడ్డారు. అసలు ఆమె గెలుపే ఒక అనిస్థితిలో ఉందని... దళితులకు ఎమ్మెల్యే సీటు రాకుండా చేసిన ఆమె రైతుల గురించి మాట్లాడుతారా? కలెక్టర్‌ స్వయంగా పిలిచి ఆమె గెలుపుపై వివరణ కోరడం జరిగిందని అనురాధ గుర్తుచేశారు. 

అసలు శ్రీదేవి ఎస్సీ ఎమ్మెల్యే అవునా? కాదా? అనే విషయం ఆగమ్యగోచరంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఆమె రైతుల గురించి ఈ రకంగా మాట్లాడటం ఏంటన్నారు. ఆమె గెలుపు కృషి చేసిన రాయపూడి సొసైటీ ఛైర్మన్‌ ఈ రోజు ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. 

చంద్రబాబునాయుడు అమరావతి వచ్చిన సమయంలో వైసీపీ కార్యకర్తలే స్వయంగా ఆ పార్టీకి ఓటు వేసినందుకు సిగ్గు పడుతున్నామని చెప్పారన్నారు. తమకు ఏ పార్టీతో సంబంధం  లేదు రైతులందరిది ఒకే పార్టీ ఒకటే అని చెప్పి మాట అని చెప్పారని గుర్తుచేశారు. 

సీఎం జగన్మోహన్‌రెడ్డి సెక్రటేరియట్‌కు వెళ్లాడానికి కాన్వాయ్‌ని ట్రయల్‌రన్‌ వేసిన పరిస్థితి  అందరికి తెలుసన్నారు. నక్సల్స్‌ ప్రాంతంలో ట్రయల్ రన్‌ వేస్తారు కానీ రైతుల మధ్యలోంచి పోవడానికి ట్రయల్ రన్‌ వేయించుకున్న ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్‌రెడ్డి ఒక్కరే అయ్యుంటారని ఎద్దేవా చేశారు. 

రాజధాని ప్రాంతం రైతుల కోసం ఉండవల్లి శ్రీదేవి సీఎంకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని....అవసరమైతే రాజీనామా చేయాలని సూచించారు. ఆళ్ల రామకృష్ణరెడ్డి 2014నుంచి 2019 వరకు ప్రజలను పట్టించుకోకుండా 365 రోజుల సరిపడా 365కేసులు వేశారని అన్నారు.  రాజధాని రాకుండా ఆర్కే ఎన్ని కేసులు వేశారో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. 

ఫిరంగిపురం గెస్ట్‌హౌస్‌లో ఆయన చేసే అనైతిక కార్యక్రమాల గురించి గుస గుసలాడుతున్నారని ఆరోపించారు. ఫోన్‌లు మాట్లాడుకుంటూ నియోజకవర్గ రైతులను, ప్రజలను గాలికి వదలివేసిన చరిత్ర ఆళ్లదని మండిపడ్డారు. టోల్‌గేటు దగ్గర బిల్డింగ్‌ కట్టిన వ్యక్తుల నుంచి ఆయన ఎన్ని కోట్టు దోచుకున్నారో ఆ పార్టీ కార్యకర్తలే చెబుతున్నారని ఆరోపించారు. 

తమ నియోజకవర్గ ప్రజలను వైసిపి ఎమ్మెల్యేలు పెయిడ్‌ ఆర్టిస్టులు అంటున్నారని అన్నారు. అలాంటప్పుడు వారు ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయాలని... దమ్ముంటే మళ్లీ పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. సెక్యూరిటీ సహయంతో సీఎం జగన్ క్యాంపు ఆఫీస్‌ వెళ్ళి నాలుగు మాటలు మాట్లాడి తిరిగి ఇంటికి వెళ్లి దాక్కుంటున్నారని అనురాధ ఎద్దేవా చేశారు. రైతులను ఆరెస్టు చేసిన వారు భయపడకుండా ధర్నాలు చేస్తున్నారని అన్నారు.    

వైసీపీ ఎమ్మెల్యే ధర్మాణ ప్రసాద్‌ మాట్లాడుతూ 7 గ్రామాలు వచ్చి ధర్నాలు చేస్తే మేము సమాధానం చెప్పాలని అవమానకరంగా మాట్లాడారన్నారు. గ్రానైట్‌ కొండల కోసం, గ్రానైట్‌ తవ్వకాల కోసం, అక్కడ ఉన్న తమ భూములకు రేట్లు పెంచడం కోసం రైతులను మోసం చేసే పరిస్థితి మొదలు పెట్టారని ఆరోపించార.

గత ఏడు నెలల నుంచి మంత్రి బోత్స సత్యనారాయణ వచ్చిరానీ భాషతో, నత్తి భాషతో రాజధాని ప్రాంతం రైతులకు నిద్ర లేకుండా చేస్తున్నారన్నారు. వైకాపా నాయకులకు రైతులంటే గౌరవం, మర్యాద లేవని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ 'డైవర్షన్ పాలిటిక్స్' చేస్తున్నారని విమర్శించారు
 
 

click me!