జగన్ మనస్తత్వమదే... అందువల్లే కఠిన నిర్ణయాలు: మోపిదేవి వెంకటరమణ

By Arun Kumar PFirst Published Jan 27, 2020, 8:03 PM IST
Highlights

ఏపి శాసనమండలి రద్దు తీర్మానంపై శాసనసభలో చర్చ సందర్భంగా మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో పెద్దల సభగా పిలిచే శాసనమండలిని రద్దు చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానంకు మద్దతిస్తున్నట్లు వైసిపి ఎమ్మెల్సీ, మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఏపి శాసనసభలో శాసనమండలి రద్దు తీర్మానంపై సందర్బంగా జరిగిన చర్చలో మంత్రి ప్రసంగించారు.  

సీఎం జగన్ అధికారం చేపట్టిన ఆరు మాసాల్లో రాష్ట్ర ప్రజలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేస్తున్నారని అన్నాయి. వాటికి చట్టబద్దత తీసుకువస్తూ అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నారని పేర్కొన్నారు. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తూ... అమ్మ ఒడి లాంటి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని ప్రశంసించారు.

 ఇంగ్లీష్ భాష ప్రాధాన్యత తెలిసిన వ్యక్తిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారన్నారు.  ఆంగ్లభాషను తప్పనిసరి చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి మండలికి పంపినప్పుడు అక్కడ ఏ విధంగా దానిని  తిరస్కరించారో చూశామని గుర్తుచేశారు. 

read more  వైసిపికి షాకిచ్చిన 17మంది ఎమ్మెల్యేలు... అసెంబ్లీ అధికారులపై జగన్ సీరియస్

రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు తొలగించాలని సీఎం భావించారని... అందులో భాగంగా పరిపాలనా, అభివృద్ది వికేంద్రీకరణ కోసం ప్రధానమైన రెండు బిల్లులను శాసనసభలో చర్చించి తీర్మానం చేశారన్నారు. అవే బిల్లులను శాసనమండలిలో ఏ విధంగా తిరస్కరించారో చూశామని... పాలకులు ప్రజల కోసం  సభలో చర్చించి తీసుకున్న నిర్ణయాలపై పెద్దల సభలో మంచి సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది అడ్డుకున్నారని అన్నారు. 

గడిచిన నాలుగు రోజుల్లో చంద్రబాబు తన రెండు నాలుకల దోరణితో ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే బిల్లులను అపహాస్యం పాలు చేశారన్నారు. ఇటువంటి సందర్బాల్లో చంద్రబాబు నిర్వాకం వల్ల ఆ చట్టసభల్లోని సభ్యులు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ప్రాంతాల మధ్య వున్న అసమానతలను తన పాదయాత్రలో ప్రత్యక్షంగా చూశారన్నారు. 

రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా అభివృద్థి వికేంద్రీకరణ అవసరమని మంత్రి పేర్కొన్నారు.  హైదరాబాద్ లోఅభివృద్ది కేంద్రీకృతం అయిన దృష్ట్యా విభజన తరువాత ఇతర ప్రాంతాల్లో ఏ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయో చూశామన్నారు. 

read more  

రాష్ట్రం విడిపోయిన తరువాత అభివృద్థి మొత్తం అమరావతిలోనే కేంద్రీకృతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని...  ఈ పరిస్థితిని మార్చేందుకు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వికేంద్రీకరణ పేరుతో సీఎం నిర్ణయం తీసుకున్నారని  వివరణ  ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని విధాలుగా అభివృద్థి జరగాలనే విశాల హృదయంతో సీఎం కొన్ని కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలని భావించారని  తెలిపారు. 

ముఖ్యమంత్రి జగన్ మనస్తత్వం ఏ విధంగా వుంటుందనేది తెలియాలంటే ఇటీవల జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి పొట్ట కూటి కోసం మత్స్యకారులు గుజరాత్ ప్రాంతం కు వేటకు వెళ్లి దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ లకు చిక్కి అరెస్ట్ అయ్యారని గుర్తుచేశారు. 

ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం వారిని పాకిస్థాన్ చెరసాల నుంచి వెనక్కి తీసకువచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. పాదయాత్ర సందర్బంగా ఆ ప్రాంతంలోని  బాధిత కుటుంబాలు జగన్ ను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే జైళ్ళలో వున్న వారిని బయటకు  తీసుకువస్తామని జగన్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పాకిస్తాన్ చెరలో వున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు కృషి చేశారని తెలిపారు. 

పాకిస్థాన్ అంబాసిడర్ తో ఇండియన్ ఎంబసీ నిరంతరం చర్చలు జరిపి వారిని బయటకు తీసుకురావడమే కాదు.. వారి బ్రతుకు దెరువు కోసం ముఖ్యమంత్రి  ప్రతి వ్యక్తికి రూ.5 లక్షలు అందించారని తెలిపారు. ఇది సీఎం మంచి మనస్సుకు నిదర్శనమన్నారు.

 విశాల దృక్పథంతో రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్థి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలనే వ్యక్తి ముఖ్యమంత్రి అని... ఆయన ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారని అన్నారు. ఇండియాటుడె సర్వేలో దేశంలోనే అత్యుత్తమ పరిపాలనాదక్షతలో 4వ స్థానంలో ప్రజాభిమానంను చూరగొంటున్న సీఎంగా గుర్తింపు పొందిన ఘనత జగన్ ది అని ప్రశంసించారు. 

అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని అతి ప్రధానమైన చట్టాలు తెస్తున్నప్పుడు మండలి సభ్యులు స్వాగతించాల్సింది పోయి  చంద్రబాబు స్వార్థపూరిత నిర్ణయాలతో వాటిని అనుగుణంగా అడ్డుకున్నారని అన్నారు. 


 

click me!