తాడేపల్లి ఆత్మహత్య కేసు... అల్లుడిపైనే మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు

Arun Kumar P   | Asianet News
Published : Feb 12, 2020, 09:23 PM IST
తాడేపల్లి ఆత్మహత్య కేసు... అల్లుడిపైనే మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు

సారాంశం

గుంటూరు జిల్లా తాడేపల్లిల్లో సంచలనంగా మారిన వలపర్ల సుజాత ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పటికే ఈ విషయంలో లాయర్ బాలశౌరిపై కేసు నమోదవగా తాజాగా పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. 

అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని బ్రహ్మానందపురానికి చెందిన వలపర్ల సుజాత ఆత్మహత్య  కేసు ఊహకందని మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే తన భార్య న్యాయవాది సత్యాల బాలశౌరి లైంగిక వేధింపుల వల్లే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిందని భర్త నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే మృతురాలి తల్లిదండ్రులు మాత్రం తమ అల్లుడ నాగరాజే కూతురి మృతికి కారణమని అదే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నారు. 

ఒక ఆత్మహత్యకు సంబందించి రెండు ఫిర్యాదులు అందడంతో కేసును ఛేదించడం తాడేపల్లి పోలీసులకు కష్టమయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు కేవలం న్యాయవాది ఆచూకీ లభిస్తే అసలు నిజాలు బయటపడతాయని భావిస్తున్న పోలీసులకు మృతురాలి తల్లిందండ్రుల ఫిర్యాదు కన్ప్యూజన్ లోకి నెట్టింది. 

read more  ప్రేమికుల రోజుకు ముందే విషాదం... విశాఖలో ప్రేమజంట ఆత్మహత్య

తమకు న్యాయం కావాలనే డిమాండ్ తో నాగరాజు తరుపున బందువులు తాడేపల్లి పోలీసు స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.  ఫిర్యాదు నెపంతో పోలిసులు నాగరాజును అదుపులో ఉంచుకుని తన భార్య కడచూపుకు కూడా అనుమతివ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు ఎద్కర్కొంటున్న న్యాయవాది బాలశౌరి ని పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదని బంధువులు నిలదీస్తున్నారు. 

మరోవైపు న్యాయవాది బాలశౌరి బందువులు కూడా మంగళగిరిలో అంబేద్కర్ సెంటర్లో నిరసన ప్రదర్శన చేపట్టారు.  కావాలనే బాలశౌరిని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని... అతడికి మద్దతుగా నిరసన  తెలిపారు. 

read more  పదమూడేళ్లుగా అదేపని, మహిళలే టార్గెట్: 150 మందికి పోర్న్ వీడియోలు

న్యాయవాది ఆచూకి ఇంకా లభ్యం కాలేదనే పోలీసులు తెలిపారు. బాలశౌరి సెల్ ఫోన్ ఆధారంగా అతడు ఎక్కడున్నాడో  కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నామని... తొందర్లోనే అతన్ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా