ఎస్సీ వర్గీకరణ పేరుతో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాల, మాదిగ ల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం మరోసారి చేస్తున్నారని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య ఆరోపించారు.
గుంటూరు: ఎస్సి వర్గీకరణ చేపట్టడానికి ప్రయత్నించి మాల, మాదిగల మద్య చిచ్చుపెట్టింది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని మాలమహానాడు జాతియ అధ్యక్షుడు చెన్నయ్య మండిపడ్డారు. రాజకీయాల కోసమే ఆయన ఎస్సీ వర్గీకరణను తెరపైకి తెచ్చాడని... ఇకపై ఈ వర్గీకరణ అంశంపై మాట్లాడటం మానేయాలని సూచించారు.
తాడేపల్లి ప్రెస్ క్లబ్ లో మాలమహానాడు నాయకులతో కలిసి చెన్నయ్య విలేకరుల సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజికీయ అంశంగానే రాజకీయ పార్టిలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వాడుకోంటున్నాయని మండిపడ్డారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇకపై ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితే తమకున్న ఓటుబ్యాంకుతో ఆ పార్టిని ఎన్నికల్లో భుస్థాపితం చేస్తామని హెచ్చరించారు.
undefined
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు రాజకీయ స్వార్థం కోసమే ఎస్సీ వర్గీకణ అంశాన్ని ఉపయోగించుకుంటున్నాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అతడు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడుతూ విద్వేశాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన జాతియ పౌరసత్వం బిల్లును తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. మాల,మాదిగలు ఉమ్మడిగా రాజ్యాధికారం దిశగా ప్రయత్నం చేయాలని... ఆ దిశగా ఇకపై తాము ప్రయత్నిస్తామని చెన్నయ్య తెలిపారు.