గుంటనక్కలా కాదు సింహంలా ఒక్కరోజైనా బ్రతుకు..: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్

Arun Kumar P   | Asianet News
Published : Feb 19, 2020, 09:42 PM ISTUpdated : Feb 19, 2020, 09:46 PM IST
గుంటనక్కలా కాదు సింహంలా ఒక్కరోజైనా బ్రతుకు..: చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫైర్

సారాంశం

మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై వైసిపి నాయకురాలు లక్ష్మీ పార్వతి విరుచుకుపడ్డారు. 

తాడేపల్లి: మాజీ సీఎం చంద్రబాబుకు కేసుల భయం పట్టుకుందని వైసిపి నాయకురాలు, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి  అన్నారు. తాను  
ఎందుకు బస్సు యాత్ర చేస్తున్నది చంద్రబాబు ప్రజలకు చెప్పాలన్నారు. చంద్రబాబు, లోకేష్ లు అవినీతితో ఈ రాష్ట్రంను భ్రష్టు పట్టించాడని... ఈ రాష్ట్రాన్ని లూటీ చేశారుని మండిపడ్డారు. 

 ఈ రాష్ట్రంలో అవినీతిరహిత పాలనను సీఎం జగన్ అందిస్తున్నారని... జ్యుడీషియల్ ప్రివ్యూ వంటి నిర్ణయాలతో అవినీతిపరుల ఆట కట్టిస్తున్నారని ప్రశంసించారు.  అందుకే ఇప్పుడు అనేకమంది పారిశ్రామికవేత్తలు ఎపి వైపు చూస్తున్నారని అన్నారు. అవినీతి అనే మాటను పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగించాలని సీఎం   జగన్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. 

చంద్రబాబు హయాంలో ఎపి అంటేనే అవినీతి అనే విధంగా మార్చారని ఆరోపించారు. జగన్ సీఎం అయిన తరువాత 340 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని...ఆయనకు చిత్తశురద్ది వుంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 

read more  వైసిపి ప్రభుత్వం ఆ మూడు పథకాలను పక్కాగా అమలుచేస్తోంది...: నారా లోకేష్

చంద్రబాబు హయాంలోనే అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. పలు జిల్లాల నుంచి అనేక మంది రైతులు వలసలు పోయారన్నారు.  జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రైతు ఆత్మహత్యలు లేవని... వలసలు ఆగిపోయాయని పేర్కొన్నారు. 

''చంద్రబాబు చెబుతున్న మరో పెద్ద అబద్దం అమరావతి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారని... ఇంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పే చంద్రబాబుకు ఇటువంటి జీవితం అవసరమా?  సింహంలా ఒక్క రోజు బతికినా చాలు. నక్కలా ఎంతకాలం బతుకుతారు చంద్రబాబు?'' అని విమర్శించారు.

''ఐటి దాడుల్లో అక్రమ సంపాదనతో పట్టుబడిన వారు టిడిపికి చెందిన వారు కాదా?  శ్రీనివాసరెడ్డి,  శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు కుమారుడు టిడిపి వారే. వేల కోట్లు విదేశాలకు నిధులు పంపి, అక్కడి నుంచి మళ్లీ ఇక్కడకు షెల్ కంపెనీల ద్వారా తెప్పించుకున్నారు. చంద్రబాబు, ఆయన మనుషులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారు.
 చంద్రబాబుకు పోయే కాలం దగ్గరకు వచ్చింది'' అని ఆరోపించారు.

read more  అశోకుడు, అక్బర్ చక్రవర్తుల తరహాలో జగన్ పాలన..: కర్నూల్ ఎంపీ

''టిడిపి వారే నాలుగు జెండాలు పెట్టుఎకుని రోడ్డును బ్లాక్ చేస్తున్నారు. తమ సభలు జయప్రదం అయ్యాయని పిచ్చిపట్టిన పచ్చమీడియాలో వార్తలు రాయించుకుంటున్నారు'' అంటూ విమర్శించారు.

''ఒకవైపు జగన్ ఎంత ఆదర్శంగా తన పాలనను సాగిస్తున్నారు.  కంటి వెలుగు ద్వారా రాష్ట్రంలోని అవ్వా తాతలకు అండగా నిలిచారు. చంద్రబాబుకు, పచ్చమీడియాకు కంటిదోషం వచ్చిందేమో.  మీరు కూడా కంటివెలుగు లో చికిత్స తీసుకుంటే మీకు నిజాలు కనిపిస్తాయి. అమ్మ ఒడి పథకం ఈ రోజు అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.  విద్య,  వైద్యంలో ఆరోగ్యకరమైన సమాజాన్ని తయారు చేస్తున్నారు'' అని లక్ష్మీపార్వతి తెలిపారు.

PREV
click me!

Recommended Stories

రైల్వేకోడూరు: అభ్యర్ధిని మార్చిన జనసేన, భాస్కరరావు స్థానంలో శ్రీధర్
ఆటోలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం: డ్రైవర్ల సమస్యలపై జనసేనాని ఆరా