మంత్రి కొడాలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ టిడిపి నాయకురాలు యలమంచిలి పద్మజను పోలీసులు అరెస్ట్ చేయడంపై గుంటూరు టిడిపి నాయకుుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆరోపిస్తూ మంత్రి కోడాలి నానిపై మంగళగిరి పోలీసులకు పిర్యాదు అందింది. వెంటనే నానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళగిరి రూరల్, పట్టణ పోలీస్ స్టేషన్లలో టిడిపి నాయకులు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరరావు, నందం అబద్దయ్య, చావాలి ఉల్లయ్య తదితరులు ఫిర్యాదు చేశారు.
ముఖ్యమంత్రి జగన్ సరైనవాడైతే నానిపై వెంటనే చర్యలు తీసుకుని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని గుంటూరు జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు జివి అంజనేయులు అన్నారు. ఎన్నో ఏళ్లుగా సీఎంగా, పతిపక్ష నాయకుడిగా రాష్ట్రానికి సేవ చేస్తున్న వ్యక్తిపై నాని నోరుపారేసుకోవడం యావత్ రాష్ట్ర ప్రజానికాన్ని బాధించిందన్నారు.
మంగళవారం ఉదయం మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన యలమంచిలి పద్మజ ను మంత్రి కోడాలి నానిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకుగానూ కంచకచర్ల పోలీసులు అదుపులోకి తీసుకుని విడుదల చేశారు. ఈ క్రమంలో టిడిపి పార్టీ శ్రేణులు పద్మజకు నైతిక మద్దతు తెలిపేందుకు అమె ఇంటికి వెళ్లి పరామర్శించారు.
read more అమ్మాయి కోసం... టిక్ టాక్ లో వీడియో చేసి యువకుడి ఆత్మహత్యాయత్నం
ఈ సందర్బంగా ఆంజనేయులు మాట్లాడుతూ...చట్టం అందరికి సమానమేని అన్నారు. కానీ ఏపిలో మాత్రం సామాన్యురాలికి ఒకలా, మంత్రి కి ఒకలా పనిచేస్తోందన్నారు. చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోడాలి నానిపై కేసు నమోదు చేసి జగన్ ప్రభుత్వం వెంటనే అతన్ని మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
పద్మజను పరామర్శించిన వారిలో పాలకోల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాలి గిరి, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , మంగళగిరి టిడిపి నాయకులు పోతినేని శ్రీనివాస్, గంజి చిరంజీవి, ఆకుల జయసత్య, నందం అబద్దయ్య, చావాలి ఉల్లయ్య తదితరులు ఉన్నారు.
read more ఆ నిధులతో గ్రామ సచివాలయ నిర్మాణాల...డిజైన్లను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి